అమరెఁ గదె నేఁడన్ని సొబగులును
(॥పల్లవి॥)
అమరెఁ గదె నేఁడన్ని సొబగులును
సమరతి చిన్నలు సతి నీ మేనా
(॥అమ॥)
చెలపల చెమటలు చెక్కిళ్ల
మొలకల నవ్వులు మొక్కిళ్ల
సొలపుల వేడుకలు చొక్కిళ్లు
తొలఁగని యాసలు తొక్కిళ్లా
(॥అమ॥)
నెఱవగు చూపులు నిక్కళ్ల
మెఱసెను తమకము మిక్కిళ్ల
గుఱుతగు నధరము గుక్కిళ్ల
తఱచగు వలపులు దక్కిళ్లా
(॥అమ॥)
నును గోరికొనలు నొక్కిళ్ల
పొనుఁగని తములము పుక్కిళ్ల
ఘనుఁడగు శ్రీవేంకటపతికాఁగిట
యెనసెను పంతము లెక్కిళ్లా
(||pallavi||)
amarĕm̐ gadĕ nem̐ḍanni sŏbagulunu
samaradi sinnalu sadi nī menā
(||ama||)
sĕlabala sĕmaḍalu sĕkkiḽla
mŏlagala navvulu mŏkkiḽla
sŏlabula veḍugalu sŏkkiḽlu
tŏlam̐gani yāsalu tŏkkiḽlā
(||ama||)
nĕṟavagu sūbulu nikkaḽla
mĕṟasĕnu tamagamu mikkiḽla
guṟudagu nadharamu gukkiḽla
taṟasagu valabulu dakkiḽlā
(||ama||)
nunu gorigŏnalu nŏkkiḽla
pŏnum̐gani tamulamu pukkiḽla
ghanum̐ḍagu śhrīveṁkaḍabadigām̐giḍa
yĕnasĕnu paṁtamu lĕkkiḽlā