అమర మాటాడితివి అవునే నీవు
(॥పల్లవి॥)
అమర మాటాడితివి అవునే నీవు
జమళి మన మాటలు సరివచ్చేవే పో
(॥॥)
అచ్చపుఁ బంతపుమాట లాడేవు మగువ నీకు
చెచ్చెర నీమెవి యేల చిల్లులాయనే
ముచ్చట నామని కాలమునఁ బండిన పంటకు
లచ్చనలు వేయరా యీలాగుల నెవ్వరును
(॥॥)
సూడుఁ బాడుకుఁ జేచాఁచే సుదతి వన్నిటా నీకు
యేడలేని జీరలు నేఁడేల వచ్చెనే
కూడి విచ్చనవిడిని కొనసాగే తీగెలకు
తోడనే ములుపొడిచి తుదఁ బోది సేయరా
(॥॥)
రతుల మారు మలసే రమణి నీచన్నులకు
సతమై వొత్తిన కందుజాడ లేడవే
యితవై నన్ను శ్రీవేంకటేశ నీవు గూడఁగాను
మతిలో ననురాగము మానునా పై మించక
(||pallavi||)
amara māḍāḍidivi avune nīvu
jamaḽi mana māḍalu sarivachcheve po
(||||)
achchabum̐ baṁtabumāḍa lāḍevu maguva nīgu
sĕchchĕra nīmĕvi yela sillulāyane
muchchaḍa nāmani kālamunam̐ baṁḍina paṁṭagu
lachchanalu veyarā yīlāgula nĕvvarunu
(||||)
sūḍum̐ bāḍugum̐ jesām̐se sudadi vanniḍā nīgu
yeḍaleni jīralu nem̐ḍela vachchĕne
kūḍi vichchanaviḍini kŏnasāge tīgĕlagu
toḍane mulubŏḍisi tudam̐ bodi seyarā
(||||)
radula māru malase ramaṇi nīsannulagu
sadamai vŏttina kaṁdujāḍa leḍave
yidavai nannu śhrīveṁkaḍeśha nīvu gūḍam̐gānu
madilo nanurāgamu mānunā pai miṁchaga