అలుకెల్లా మానితిని అట్టే కానీవే
(॥పల్లవి॥)
అలుకెల్లా మానితిని అట్టే కానీవే
చెలులాల మీకు నిది సెలవు గానీరే
(॥అలు॥)
తప్పు లెన్ని గలిగినా తన్ను నేఁ గోపగించేనా
అప్పటిమాటలు వింటి నట్టే కానీవే
అప్పస మందరు మీరు అండనుండి ఆతనికిఁగా
చెప్పేరట నేనూ నట్టే సే సేఁగాని
(॥అలు॥)
వొడ్డారపువాఁడైతే వొరసి నే నిందుకుఁగా
అడ్డమాడే దాననా నీకు నట్టే కానీవే
వెడ్డు వెట్టకురే మీరు వింటిమాట; నాలికెను
జిడ్డంటునా అట్టే సే సేఁ గానీవే
(॥అలు॥)
వాసులు దాఁ బట్టితేను వద్దనేనా పొందులకు
ఆసపడ్డదాన నేను అట్టే కానీవే
వేసరరు మీరు శ్రీ వేంకటేశుఁ డిదె కూడె
సేసవెట్టితిని యిట్టె సే సేఁ గానీవే
(||pallavi||)
alugĕllā mānidini aṭṭe kānīve
sĕlulāla mīgu nidi sĕlavu gānīre
(||alu||)
tappu lĕnni galiginā tannu nem̐ gobagiṁchenā
appaḍimāḍalu viṁṭi naṭṭe kānīve
appasa maṁdaru mīru aṁḍanuṁḍi ādanigim̐gā
sĕpperaḍa nenū naṭṭe se sem̐gāni
(||alu||)
vŏḍḍārabuvām̐ḍaide vŏrasi ne niṁdugum̐gā
aḍḍamāḍe dānanā nīgu naṭṭe kānīve
vĕḍḍu vĕṭṭagure mīru viṁṭimāḍa; nāligĕnu
jiḍḍaṁṭunā aṭṭe se sem̐ gānīve
(||alu||)
vāsulu dām̐ baṭṭidenu vaddanenā pŏṁdulagu
āsabaḍḍadāna nenu aṭṭe kānīve
vesararu mīru śhrī veṁkaḍeśhum̐ ḍidĕ kūḍĕ
sesavĕṭṭidini yiṭṭĕ se sem̐ gānīve