అలుగఁజూచేవు నీవు అంతేసికిఁ బొద్దేది
(॥పల్లవి॥)
అలుగఁజూచేవు నీవు అంతేసికిఁ బొద్దేది
తలపోఁత యిప్పుడింతే దాచఁగఁ బొద్దేది
(॥అలు॥)
నీరాక వింటే నింతే నివ్వెరగైతి నిట్టె
ఆరసి నీతో మాటలాడఁ బొద్దేది
చేరితి నిప్పుడే యింతే సిగ్గున మునిగితిని
మోరతోపు మాని నీకు మొక్కఁగాఁ బొద్దేది
(॥అలు॥)
నీదెస చూచితి నింతే నిలువెల్లఁ బులకించె
నాదించి నీతో నవ్వఁబొద్దేది
పాదము లొత్తితి నింతే భావమెల్లఁ గరఁగితి
సేదదేర వినయముసేయఁ బొద్దేది
(॥అలు॥)
కూడితి నిట్టె ఇంతె గొబ్బన మేను చొక్కితి
మేడెపునీరతులక మెచ్చఁబొద్దేది
వాడికశ్రీవేంకటేశ వరస నాకిపుడింతే
తోడనే నేసవెట్టితి తొలఁగఁ బొద్దేది
(||pallavi||)
alugam̐jūsevu nīvu aṁtesigim̐ bŏddedi
talabom̐ta yippuḍiṁte dāsam̐gam̐ bŏddedi
(||alu||)
nīrāga viṁṭe niṁte nivvĕragaidi niṭṭĕ
ārasi nīdo māḍalāḍam̐ bŏddedi
seridi nippuḍe yiṁte sigguna munigidini
moradobu māni nīgu mŏkkam̐gām̐ bŏddedi
(||alu||)
nīdĕsa sūsidi niṁte niluvĕllam̐ bulagiṁchĕ
nādiṁchi nīdo navvam̐bŏddedi
pādamu lŏttidi niṁte bhāvamĕllam̐ garam̐gidi
sedadera vinayamuseyam̐ bŏddedi
(||alu||)
kūḍidi niṭṭĕ iṁtĕ gŏbbana menu sŏkkidi
meḍĕbunīradulaga mĕchcham̐bŏddedi
vāḍigaśhrīveṁkaḍeśha varasa nāgibuḍiṁte
toḍane nesavĕṭṭidi tŏlam̐gam̐ bŏddedi