అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ
(॥పల్లవి॥)
అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ
నలి నిందిర నీతో నవ్వినది
(॥అలు॥)
ఆదిలక్షి మోహనకమలంబున
వేదమాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును
సాదరమునఁ గడుఁ జాఁచినది
(॥అలు॥)
సిరి దనకన్నుల చింతామణులను
పొరి నీపై దిగఁబోసినది
వరదహస్తమున వలచెయి వట్టుక
అరుదుగ విను మాఁటాడించినది
(॥అలు॥)
జలదికన్య తనసర్వాంగంబులఁ
బిలిచి నిన్ను నిటు పెనఁగినది
అలముక శ్రీవేంకటాధిప నిను రతి-
నెలమి నీవురఁ(రం) బెక్కినది
(||pallavi||)
alugalu sĕllavu hari puruṣhottama
nali niṁdira nīdo navvinadi
(||alu||)
ādilakṣhi mohanagamalaṁbuna
vedamāda ninu vesinadi
ādĕsa nībai nabhayahastamunu
sādaramunam̐ gaḍum̐ jām̐sinadi
(||alu||)
siri danagannula siṁtāmaṇulanu
pŏri nībai digam̐bosinadi
varadahastamuna valasĕyi vaṭṭuga
aruduga vinu mām̐ṭāḍiṁchinadi
(||alu||)
jaladiganya tanasarvāṁgaṁbulam̐
bilisi ninnu niḍu pĕnam̐ginadi
alamuga śhrīveṁkaḍādhiba ninu radi-
nĕlami nīvuram̐(raṁ) bĕkkinadi