అలుకలేఁటికి రావే యాతనివద్దికి నీవు
(॥పల్లవి॥)
అలుకలేఁటికి రావే యాతనివద్దికి నీవు
బలిమైతే వలపులు పదనుకు వచ్చునా
(॥అలుక॥)
సంగడినున్న సతికి చనవులు గలుగు గాక
కంగి కడనుండితేను కలదా పొందు
చెంగటనున్న రుచులు చేరి నోరూరించుఁగాక
అంగడినున్న సొమ్ములు ఆసలు పుట్టించునా
(॥అలుక॥)
వినయపుటింతికిని వేడుకలీడేరు గాక
పెనఁగుచు బిగిసితే ప్రేమ పుట్టునా
తనువున బూసినగందము చల్లనౌఁగాక
వనములో తరువులు వడదేర్చ నోపునా
(॥అలుక॥)
సేవ చేసేమగువకు చేతలెల్లాఁ జెల్లుఁ గాక
యీవల నొడ్డారించితే నింపు వుట్టునా
శ్రీవేంకటేశుఁ డిందు విచ్చేసి తా నిన్నుఁ గూడెను
పూవులు పిందెలౌఁగాక పొల్లు వెలవెట్టునా
(||pallavi||)
alugalem̐ṭigi rāve yādanivaddigi nīvu
balimaide valabulu padanugu vachchunā
(||aluga||)
saṁgaḍinunna sadigi sanavulu galugu gāga
kaṁgi kaḍanuṁḍidenu kaladā pŏṁdu
sĕṁgaḍanunna rusulu seri norūriṁchum̐gāga
aṁgaḍinunna sŏmmulu āsalu puṭṭiṁchunā
(||aluga||)
vinayabuḍiṁtigini veḍugalīḍeru gāga
pĕnam̐gusu bigiside prema puṭṭunā
tanuvuna būsinagaṁdamu sallanaum̐gāga
vanamulo taruvulu vaḍadersa nobunā
(||aluga||)
seva sesemaguvagu sedalĕllām̐ jĕllum̐ gāga
yīvala nŏḍḍāriṁchide niṁpu vuṭṭunā
śhrīveṁkaḍeśhum̐ ḍiṁdu vichchesi tā ninnum̐ gūḍĕnu
pūvulu piṁdĕlaum̐gāga pŏllu vĕlavĕṭṭunā