అలుక గాదు నీతో నన్నిటా మన్ననదాన
(॥పల్లవి॥)
అలుక గాదు నీతో నన్నిటా మన్ననదాన
చలపట్టి యందరితో సరి సేయ కిఁకను
(॥అలుక॥)
చిత్తము నొవ్వకుమీ చెప్పే నే నొకమాట
హత్తిమంచ మెక్కు మన కంతే చాలు
యిత్తల నీ కూడిగాలు యెన్ని యైనఁ జేసేఁ గాని
పొత్తుల యెంగిలితోడి బోగము సయించదు
(॥అలుక॥)
ఆనలు వెట్టకుమీ అడిగే నే కొకయీవి
పూని నాతోడ నవ్వకు పొందులే చాలు
కానిమ్మని నీవద్ద నేఁ గాచుకుండే నేపొద్దు
సానఁ బట్టేసరసాలు చవి గాదు నాకును
(॥అలుక॥)
చేతుల మొక్కకుమీ సేసేఁ గాని నీమాఁట
రాతిరి నన్నుఁ గూడినరతులే చాలు
యీతల శ్రీవెంకటేశ యిప్పుడు నన్నుఁ గూడితి
కాతరాన నీతోడఁ గపట మెరఁగనూ
(||pallavi||)
aluga gādu nīdo nanniḍā mannanadāna
salabaṭṭi yaṁdarido sari seya kim̐kanu
(||aluga||)
sittamu nŏvvagumī sĕppe ne nŏgamāḍa
hattimaṁcha mĕkku mana kaṁte sālu
yittala nī kūḍigālu yĕnni yainam̐ jesem̐ gāni
pŏttula yĕṁgilidoḍi bogamu sayiṁchadu
(||aluga||)
ānalu vĕṭṭagumī aḍige ne kŏgayīvi
pūni nādoḍa navvagu pŏṁdule sālu
kānimmani nīvadda nem̐ gāsuguṁḍe nebŏddu
sānam̐ baṭṭesarasālu savi gādu nāgunu
(||aluga||)
sedula mŏkkagumī sesem̐ gāni nīmām̐ṭa
rādiri nannum̐ gūḍinaradule sālu
yīdala śhrīvĕṁkaḍeśha yippuḍu nannum̐ gūḍidi
kādarāna nīdoḍam̐ gabaḍa mĕram̐ganū