(॥పల్లవి॥)
అల్లవారే సరసములాడుకొనేరు
వెల్లవిరియైనట్టి వేడుకకాండ్లె
(॥అల్ల॥)
గద్దెమీఁద నున్నవారు కాంతయు రమణుఁడును
పెద్దరికములకే పెనఁగేరు
వొద్దికైననేరుపుల నొకరొకరి నెంచితే
ఇద్దరి కిద్దరే సాటి ఇన్నిటాను జాణలే
(॥అల్ల॥)
తెరలొ నున్నవారు దేవియు దేవరవలె
దొరతనపుఁబంతాల దులఁదూఁగేరు
సరి నెంచిచూచితే చక్కఁదనములయందు
పిరుతియ్య కొండొరులు పెచ్చువెరిగేరే
(॥అల్ల॥)
అలముకవున్నవారు అల్లియుఁ దామరవలె
పిలువుఁ బ్రియములతోఁ బెండ్లాడేరు
అలమేలుమంగ యీకె అతఁడు శ్రీవేంకటేశుఁ-
డలరీ తానూఁదాను నమరివున్నారే
(||pallavi||)
allavāre sarasamulāḍugŏneru
vĕllaviriyainaṭṭi veḍugagāṁḍlĕ
(||alla||)
gaddĕmīm̐da nunnavāru kāṁtayu ramaṇum̐ḍunu
pĕddarigamulage pĕnam̐geru
vŏddigainanerubula nŏgarŏgari nĕṁchide
iddari kiddare sāḍi inniḍānu jāṇale
(||alla||)
tĕralŏ nunnavāru deviyu devaravalĕ
dŏradanabum̐baṁtāla dulam̐dūm̐geru
sari nĕṁchisūside sakkam̐danamulayaṁdu
pirudiyya kŏṁḍŏrulu pĕchchuvĕrigere
(||alla||)
alamugavunnavāru alliyum̐ dāmaravalĕ
piluvum̐ briyamuladom̐ bĕṁḍlāḍeru
alamelumaṁga yīgĕ adam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍalarī tānūm̐dānu namarivunnāre