Allavaamde neevibhudu aayamulamtee valabu

అల్లవాఁడె నీవిభుడు ఆయములంటీ వలపు
Language

(॥పల్లవి॥)
అల్లవాఁడె నీవిభుడు ఆయములంటీ వలపు
చల్లఁగదే మోహము చాలఁ గలిగీని

(॥అల్ల॥)
చన్ను మొనలు గదలఁ జాఁచి చేతుల నతని
సన్నలఁ బిలువఁ గదే చవు లయ్యీని
మున్నిటినీ పొందులు మోవి తేనెలు గారఁగ
విన్నపము సేయఁగదే వేడుక వుట్టీని

(॥అల్ల॥)
నిలుచుండి యెలుఁగులు నిడుసాగిల నూఁకొని
సెలవుల నవ్వఁ గదే చింత వాసీని
తలుపుమాటున నుండి తప్పక ఆతనిదిక్కు
సొలసి చూడఁగదవే సొంపులై యుండీని

(॥అల్ల॥)
చెంగలించి నిట్టూర్పుల చెమట లార విసరి
సంగడిఁ గూచుండవే ఆలు రేఁగీని
అంగవించి శ్రీవేంకటాధిపఁడు నిన్నుఁ గూడె
కందు లే కుండఁగదవే కాఁపుర మీడేరీని

(||pallavi||)
allavām̐ḍĕ nīvibhuḍu āyamulaṁṭī valabu
sallam̐gade mohamu sālam̐ galigīni

(||alla||)
sannu mŏnalu gadalam̐ jām̐si sedula nadani
sannalam̐ biluvam̐ gade savu layyīni
munniḍinī pŏṁdulu movi tenĕlu gāram̐ga
vinnabamu seyam̐gade veḍuga vuṭṭīni

(||alla||)
nilusuṁḍi yĕlum̐gulu niḍusāgila nūm̐kŏni
sĕlavula navvam̐ gade siṁta vāsīni
talubumāḍuna nuṁḍi tappaga ādanidikku
sŏlasi sūḍam̐gadave sŏṁpulai yuṁḍīni

(||alla||)
sĕṁgaliṁchi niṭṭūrbula sĕmaḍa lāra visari
saṁgaḍim̐ gūsuṁḍave ālu rem̐gīni
aṁgaviṁchi śhrīveṁkaḍādhibam̐ḍu ninnum̐ gūḍĕ
kaṁdu le kuṁḍam̐gadave kām̐pura mīḍerīni