అల్లవాఁడె గద్దెమీఁద నంగనలు గొలవఁగా
(॥పల్లవి॥)
అల్లవాఁడె గద్దెమీఁద నంగనలు గొలవఁగా
వుల్లాసముతో నవ్వీని ఉద్దగిరి కృష్ణుఁడు
(॥అల్ల॥)
పచ్చఁబట్టు దట్టివాఁడు బాలకృష్ణుఁడు
పచ్చి దేరే పెదవుల బాలకృష్ణుఁడు
బచ్చన చక్రముచేతి బాలకృష్ణుఁడు
పచ్చారి వలపులనే బాలకృష్ణుఁడు
(॥అల్ల॥)
బలురోలఁ గట్టువడె బాలకృష్ణుఁడు
బలిమి మద్దుల దోసె బాలకృష్ణుఁడు
పలు గోపికలఁ గూడె బాలకృష్ణుఁడు
బలరాము తమ్ముఁడు బాలకృష్ణుఁడు
(॥అల్ల॥)
పట్టినాఁడు వెన్నముద్ద బాలకృష్ణుఁడు
పట్టుఁగొమ్ము సురలకు బాలకృష్ణుఁడు
బట్ట బయట మెరసే బాలకృష్ణుఁడు
పట్టపు శ్రీవేంకటాద్రి బాలకృష్ణుఁడు
(||pallavi||)
allavām̐ḍĕ gaddĕmīm̐da naṁganalu gŏlavam̐gā
vullāsamudo navvīni uddagiri kṛṣhṇum̐ḍu
(||alla||)
pachcham̐baṭṭu daṭṭivām̐ḍu bālakṛṣhṇum̐ḍu
pachchi dere pĕdavula bālakṛṣhṇum̐ḍu
bachchana sakramusedi bālakṛṣhṇum̐ḍu
pachchāri valabulane bālakṛṣhṇum̐ḍu
(||alla||)
balurolam̐ gaṭṭuvaḍĕ bālakṛṣhṇum̐ḍu
balimi maddula dosĕ bālakṛṣhṇum̐ḍu
palu gobigalam̐ gūḍĕ bālakṛṣhṇum̐ḍu
balarāmu tammum̐ḍu bālakṛṣhṇum̐ḍu
(||alla||)
paṭṭinām̐ḍu vĕnnamudda bālakṛṣhṇum̐ḍu
paṭṭum̐gŏmmu suralagu bālakṛṣhṇum̐ḍu
baṭṭa bayaḍa mĕrase bālakṛṣhṇum̐ḍu
paṭṭabu śhrīveṁkaḍādri bālakṛṣhṇum̐ḍu