అల్లవాఁడె భావించరె అంగన లిందరుఁ గూడి
(॥పల్లవి॥)
అల్లవాఁడె భావించరె అంగన లిందరుఁ గూడి
వుల్లములో తనమాయ లుబ్బెనో శ్రీహరికి
(॥॥)
నేలా మిన్నుఁ గొలవఁగ మిన్నేటినురుగు
ఆలరి యీహరిమేన నంటుకొనెనో
పాలవెల్లి తచ్చఁబోఁగాఁ బైఁబడెనో తుంపురులు
మేలిమి కప్పురకాపు మెత్తిరో యీహరికి
(॥॥)
చిత్తగించి రేపల్లెఁ జీఁకటితప్పు సేయఁగా
అత్తల చీఁకటినలు పంటుకొనెనేమో
వొత్తి కరిఁ గావబోఁగా నొలికెనో పై మదము
మొత్తమిఁ బుళుగుకాపు ముంచిరో శ్రీహరికి
(॥॥)
అలమేలుమంగఁ దెచ్చి అఱుతఁ గట్టుకొనఁగా
పొలసి నవరసాలుఁ బొడచూపెనో
నెలవైన సొమ్ములెల్లా నిండుకొనె మేననెల్లా
అలరి శ్రీ వేంకటాద్రి నందమైనహరికి
(||pallavi||)
allavām̐ḍĕ bhāviṁcharĕ aṁgana liṁdarum̐ gūḍi
vullamulo tanamāya lubbĕno śhrīharigi
(||||)
nelā minnum̐ gŏlavam̐ga minneḍinurugu
ālari yīharimena naṁṭugŏnĕno
pālavĕlli tachcham̐bom̐gām̐ baim̐baḍĕno tuṁpurulu
melimi kappuragābu mĕttiro yīharigi
(||||)
sittagiṁchi reballĕm̐ jīm̐kaḍidappu seyam̐gā
attala sīm̐kaḍinalu paṁṭugŏnĕnemo
vŏtti karim̐ gāvabom̐gā nŏligĕno pai madamu
mŏttamim̐ buḽugugābu muṁchiro śhrīharigi
(||||)
alamelumaṁgam̐ dĕchchi aṟudam̐ gaṭṭugŏnam̐gā
pŏlasi navarasālum̐ bŏḍasūbĕno
nĕlavaina sŏmmulĕllā niṁḍugŏnĕ menanĕllā
alari śhrī veṁkaḍādri naṁdamainaharigi