అల్లనాఁడే కంటి వింటి నధోక్షజా
(॥పల్లవి॥)
అల్లనాఁడే కంటి వింటి నధోక్షజా
అల్లుకొంటి విని చెలుల నధోక్షజా
(॥అల్ల॥)
అందు నిందు నీ యిర వధోక్షజా
అందాలు చెప్ప వచ్చే వధోక్షజా
అందరు నెఱుఁగుదురు యధోక్షజా మాకు
నందుకొని బా సిచ్చే వధోక్షజా
(॥అల్ల॥)
అంగడి మొక్కువారమా అధోక్షజా నీకే
యంగము యీ నడవడి యధోక్షజా
అంగజముద్రలు నించే వధోక్షజా నీ
యంగనలు గాదనేరా యధోక్షజా
(॥అల్ల॥)
అసరాదు గాక నిన్ను నధోక్షజా కడు
ననుకాయెఁ బ్రియములు అధోక్షజా
అనుఁగు శ్రీవేంకటాద్రి యధోక్షజా మమ్ము
నవిశముఁ గూడితివి యధోక్షజా
(||pallavi||)
allanām̐ḍe kaṁṭi viṁṭi nadhokṣhajā
allugŏṁṭi vini sĕlula nadhokṣhajā
(||alla||)
aṁdu niṁdu nī yira vadhokṣhajā
aṁdālu sĕppa vachche vadhokṣhajā
aṁdaru nĕṟum̐guduru yadhokṣhajā māgu
naṁdugŏni bā sichche vadhokṣhajā
(||alla||)
aṁgaḍi mŏkkuvāramā adhokṣhajā nīge
yaṁgamu yī naḍavaḍi yadhokṣhajā
aṁgajamudralu niṁche vadhokṣhajā nī
yaṁganalu gādanerā yadhokṣhajā
(||alla||)
asarādu gāga ninnu nadhokṣhajā kaḍu
nanugāyĕm̐ briyamulu adhokṣhajā
anum̐gu śhrīveṁkaḍādri yadhokṣhajā mammu
naviśhamum̐ gūḍidivi yadhokṣhajā