అల్లనాఁ డెఱఁగవా ఆకెవో యీకె
(॥పల్లవి॥)
అల్లనాఁ డెఱఁగవా ఆకెవో యీకె
పెల్లుగా నీ తమ్ములము పెట్టించుకొనదా
(॥అల్ల॥)
అంగనతో మాటలాడి ఆయములు గరఁగుతా
సంగాతాలు సేయవా చావడిలోను
సంగడినే నిలుచుండి సారెఁ జెమరించుకొంటా
కొంగుఁగొంగు మోయఁగఁ గొలిపించుకొనవా
(॥అల్ల॥)
భావించి చూచిచూచి పరవశమందు కొంటా
వావులు దెలుపవా వాకిటనుండి
పూవుల వేసి మోహాన బుసకొట్టుకొంటాను
సోవగా సతిచే నాకు చుట్టింపించుకొనవా
(॥అల్ల॥)
గుట్టుతోనే నవ్వి మేను గుబ్బతిలఁ బులకించి
ఇట్టె కాఁగిలించుకోవా ఇంటిలోనను
నెట్టన శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
చుట్టి నన్నేలి యీకె కీసుద్దులెల్లఁ జెప్పవా
(||pallavi||)
allanām̐ ḍĕṟam̐gavā āgĕvo yīgĕ
pĕllugā nī tammulamu pĕṭṭiṁchugŏnadā
(||alla||)
aṁganado māḍalāḍi āyamulu garam̐gudā
saṁgādālu seyavā sāvaḍilonu
saṁgaḍine nilusuṁḍi sārĕm̐ jĕmariṁchugŏṁṭā
kŏṁgum̐gŏṁgu moyam̐gam̐ gŏlibiṁchugŏnavā
(||alla||)
bhāviṁchi sūsisūsi paravaśhamaṁdu kŏṁṭā
vāvulu dĕlubavā vāgiḍanuṁḍi
pūvula vesi mohāna busagŏṭṭugŏṁṭānu
sovagā sadise nāgu suṭṭiṁpiṁchugŏnavā
(||alla||)
guṭṭudone navvi menu gubbadilam̐ bulagiṁchi
iṭṭĕ kām̐giliṁchugovā iṁṭilonanu
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
suṭṭi nanneli yīgĕ kīsuddulĕllam̐ jĕppavā