Allamtanumde maada laanadeevayyaa

అల్లంతనుండే మాట లానతీవయ్యా
Language

(॥పల్లవి॥)
అల్లంతనుండే మాట లానతీవయ్యా
చెల్లఁ బో నీ చెప్పినట్టు సేయ ననేనా

(॥॥)
సరుసకు వచ్చి నన్ను సారె వేఁడుకోకువయ్య
నిరతిఁ గొప్పు విరులు నీపైఁ జిందీని
కరములు వట్టి యెంత గారవించ వచ్చేవయ్య
వొరసి నా మాణికాల వుంగరాలొత్తీని

(॥॥)
తొడపైకిఁ దీసి యెంత తూరి బుజ్జగించేవయ్య
వడిసీ నా చెవిలో జవ్వాది నీమీఁద
వొడివట్టి నన్నింత వొడఁబరచ నేలయ్య
వుడుకు నిట్టూర్పు గాలి వొళ్ళు సోఁకీని

(॥॥)
యిట్టే నన్నుఁ గౌఁగిలించి యెంత లాలించేవయ్య
గట్టి నా చన్నులమీఁది గంద మంటీని
గుట్టున శ్రీ వేంకటేశకూడి యాదరించేవయ్య
ముట్టి నామదము నిన్ను ముంచుకొనీని

(||pallavi||)
allaṁtanuṁḍe māḍa lānadīvayyā
sĕllam̐ bo nī sĕppinaṭṭu seya nanenā

(||||)
sarusagu vachchi nannu sārĕ vem̐ḍugoguvayya
niradim̐ gŏppu virulu nībaim̐ jiṁdīni
karamulu vaṭṭi yĕṁta gāraviṁcha vachchevayya
vŏrasi nā māṇigāla vuṁgarālŏttīni

(||||)
tŏḍabaigim̐ dīsi yĕṁta tūri bujjagiṁchevayya
vaḍisī nā sĕvilo javvādi nīmīm̐da
vŏḍivaṭṭi nanniṁta vŏḍam̐barasa nelayya
vuḍugu niṭṭūrbu gāli vŏḽḽu som̐kīni

(||||)
yiṭṭe nannum̐ gaum̐giliṁchi yĕṁta lāliṁchevayya
gaṭṭi nā sannulamīm̐di gaṁda maṁṭīni
guṭṭuna śhrī veṁkaḍeśhagūḍi yādariṁchevayya
muṭṭi nāmadamu ninnu muṁchugŏnīni