Alladivo soodaramma adivabhaavamu nemdu

అల్లదివో చూడరమ్మ అతివభావము నేఁడు
Language

(॥పల్లవి॥)
అల్లదివో చూడరమ్మ అతివభావము నేఁడు
వెల్లవిరిఁ బతివద్ద వింతలాయఁ గదరె

(॥అల్ల॥)
తప్పక చూచి యింతి తలవంచి సిగ్గువడి
చిప్పిలఁ గడమచూపు చిత్తములోఁ జూచెనే
కొప్పు గదల నడచి కొంచి కడమనడపు
చెప్పక పయ్యద మాఁటుసేయుచు నడచెనే

(॥అల్ల॥)
సెలవిఁబారఁగ నవ్వి సిగ్గునఁ గడమనవ్వు
కులికి కులికి తనకుత్తికలో నవ్వెనే
నిలిచి కొంతమాఁటాడి నీఁటునఁ గడమమాఁట
సెలసిచేయి మరగుచేసుక మాటాడెనే

(॥అల్ల॥)
చేతికి నాకు చుట్టిచ్చి సిగ్గుతోడ సగమాకు
చేతనే చిదిమి తనవాతెరఁ గీలించినే
యీతల శ్రీవేంకటేశుఁ డింతిభావములు చూచి
కాతరానఁ గూడఁగాను గడుసై నిలిచెనే

(||pallavi||)
alladivo sūḍaramma adivabhāvamu nem̐ḍu
vĕllavirim̐ badivadda viṁtalāyam̐ gadarĕ

(||alla||)
tappaga sūsi yiṁti talavaṁchi sigguvaḍi
sippilam̐ gaḍamasūbu sittamulom̐ jūsĕne
kŏppu gadala naḍasi kŏṁchi kaḍamanaḍabu
sĕppaga payyada mām̐ṭuseyusu naḍasĕne

(||alla||)
sĕlavim̐bāram̐ga navvi siggunam̐ gaḍamanavvu
kuligi kuligi tanaguttigalo navvĕne
nilisi kŏṁtamām̐ṭāḍi nīm̐ṭunam̐ gaḍamamām̐ṭa
sĕlasiseyi maragusesuga māḍāḍĕne

(||alla||)
sedigi nāgu suṭṭichchi siggudoḍa sagamāgu
sedane sidimi tanavādĕram̐ gīliṁchine
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtibhāvamulu sūsi
kādarānam̐ gūḍam̐gānu gaḍusai nilisĕne