అల్లదివో చేత నీకు నప్పగించితి
(॥పల్లవి॥)
అల్లదివో చేత నీకు నప్పగించితి
వల్లెవాటుతోడ నింత వలలఁ బెట్టేదా
(॥అల్ల॥)
నిన్నుఁ బాసి విరహన నెగులుతో నున్న సతిఁ
గన్నులఁ జూచి యేమి గట్టుకొంటివి
యెన్నిక రాజము నీ కెంత గలిగిన భూమిఁ
బన్నినయాడువారిపైనే చూపేదా
(॥అల్ల॥)
పాయము నీకు మీఁదెత్తి పడతి వుండఁగ నీవు
చాయ సేకొని యంత జాణవైతివి
ఆయలే బిరుదుబంటవై మెరసినదెల్ల
రాయడి యింతుల నింత రవ్వసేసేదా
(॥అల్ల॥)
పిలిచేటినీమీఁది ప్రేమము గలయింతికిఁ
బలుకక యిప్పు డెంతపని సేసితి
నిలిచి శ్రీ వేంకటేశ నేఁడె యాపె గూడితివి
వలచిన వారికే వనమయ్యేదా
(||pallavi||)
alladivo seda nīgu nappagiṁchidi
vallĕvāḍudoḍa niṁta valalam̐ bĕṭṭedā
(||alla||)
ninnum̐ bāsi virahana nĕguludo nunna sadim̐
gannulam̐ jūsi yemi gaṭṭugŏṁṭivi
yĕnniga rājamu nī kĕṁta galigina bhūmim̐
banninayāḍuvāribaine sūbedā
(||alla||)
pāyamu nīgu mīm̐dĕtti paḍadi vuṁḍam̐ga nīvu
sāya segŏni yaṁta jāṇavaidivi
āyale birudubaṁṭavai mĕrasinadĕlla
rāyaḍi yiṁtula niṁta ravvasesedā
(||alla||)
piliseḍinīmīm̐di premamu galayiṁtigim̐
balugaga yippu ḍĕṁtabani sesidi
nilisi śhrī veṁkaḍeśha nem̐ḍĕ yābĕ gūḍidivi
valasina vārige vanamayyedā