Alladivo naayagumda appudu nem jeppinadi

అల్లదివో నాయకుఁడ అప్పుడు నేఁ జెప్పినది
Language

(॥పల్లవి॥)
అల్లదివో నాయకుఁడ అప్పుడు నేఁ జెప్పినది
వొల్లనే వొయ్యారి బాగై నిలుచున్నది

(॥అల్ల॥)
కొండుకగుబ్బలమీఁద కుంకుమ పూసినది
అండనే వలిపయ్యద గప్పినది
మెండుగఁ గస్తురినామమె నుదటఁ బెట్టినది
కొండలరాయఁడ నీకు గురియై తానున్నది

(॥అల్ల॥)
చిప్పిలు నిలువుఁ గొప్పున సేసవిరులది
కప్పురవిడేలఁ గన్నుల నవ్వేటిది
వుప్పతిల్లు సొమ్ములతో నొరపుమించినది
అప్పఁడ నీచేఁతలకు నందమై తా నున్నది

(॥అల్ల॥)
చేపల నిన్ను దగ్గరి చెఱఁగు వట్టినది
యీవల నీభావమెల్ల వింతగాఁ జేసినది
శ్రీవేంకటేశుఁడ నీచిత్తము వట్టినది
సావితో నీరతులలలో సదమదమైనది

(||pallavi||)
alladivo nāyagum̐ḍa appuḍu nem̐ jĕppinadi
vŏllane vŏyyāri bāgai nilusunnadi

(||alla||)
kŏṁḍugagubbalamīm̐da kuṁkuma pūsinadi
aṁḍane valibayyada gappinadi
mĕṁḍugam̐ gasturināmamĕ nudaḍam̐ bĕṭṭinadi
kŏṁḍalarāyam̐ḍa nīgu guriyai tānunnadi

(||alla||)
sippilu niluvum̐ gŏppuna sesaviruladi
kappuraviḍelam̐ gannula navveḍidi
vuppadillu sŏmmulado nŏrabumiṁchinadi
appam̐ḍa nīsem̐talagu naṁdamai tā nunnadi

(||alla||)
sebala ninnu daggari sĕṟam̐gu vaṭṭinadi
yīvala nībhāvamĕlla viṁtagām̐ jesinadi
śhrīveṁkaḍeśhum̐ḍa nīsittamu vaṭṭinadi
sāvido nīradulalalo sadamadamainadi