(॥పల్లవి॥)
అల్లదె మేడమీఁద నతివ
వెల్లవిరయ్యీ నిట్టె విచ్చేయవయ్యా
(॥॥)
వాలుకచూపులు నీపై వంచీ
బేలుఁబులకలు మేనఁ బెంచీ
తాలిమెందు దాఁచెనో తాను నీకే
మేలుసేసి వున్న దిదె మిక్కిలి మాపిన్నది
(॥॥)
మనసు నీపైఁ గడుమరిగీ
వొనరుఁజెలులమీఁద నొరగీ
తనివిదీర దెంతైనా తాను నీకె
అనయము దలఁచితి నన్నది మాపిన్నది
(॥॥)
తమకపుఁ జెమటలఁ దడసీ
జమళి కోరికలచే జడిసీ
నెమకి శ్రీవేంకటేశ నిన్నుఁ గూడి
గములై ననీగుణాలు కన్నది మాపిన్నది
(||pallavi||)
alladĕ meḍamīm̐da nadiva
vĕllavirayyī niṭṭĕ vichcheyavayyā
(||||)
vālugasūbulu nībai vaṁchī
belum̐bulagalu menam̐ bĕṁchī
tālimĕṁdu dām̐sĕno tānu nīge
melusesi vunna didĕ mikkili mābinnadi
(||||)
manasu nībaim̐ gaḍumarigī
vŏnarum̐jĕlulamīm̐da nŏragī
tanividīra dĕṁtainā tānu nīgĕ
anayamu dalam̐sidi nannadi mābinnadi
(||||)
tamagabum̐ jĕmaḍalam̐ daḍasī
jamaḽi korigalase jaḍisī
nĕmagi śhrīveṁkaḍeśha ninnum̐ gūḍi
gamulai nanīguṇālu kannadi mābinnadi