Allade javvani hariyuramuna nade

అల్లదె జవ్వని హరియురమున నదె
Language

(॥పల్లవి॥)
అల్లదె జవ్వని హరియురమున నదె
మెల్లనె యిటు వుపమించరే మీరు

(॥॥)
ముత్తెపుజిప్పలో ముంచినకలువలో
వొత్తిలి కనుఁగవ లొకమాటాడరే
గుత్తపుఁగుండలో కొండలో కుచములో
హత్తి యేర్పడఁగ ననరే మీరు

(॥॥)
తామెరతూండ్లో తతియగు తీగెలో
భామచేతు లేర్పరచరే యిపుడు
దోమటిసింహమో తొడఁగినబయలో
ఆమాటాడరే అందులో నొకటి

(॥॥)
నీలపుమణులో నిండిన మేఘమో
బాలకితురు మొకపలుకునఁ జెప్పరే
యీలీల శ్రీ వేంకటేశ్వరుఁగూడెను
మేలిమి మెఱుఁగో మెలుఁతో యనరే

(||pallavi||)
alladĕ javvani hariyuramuna nadĕ
mĕllanĕ yiḍu vubamiṁchare mīru

(||||)
muttĕbujippalo muṁchinagaluvalo
vŏttili kanum̐gava lŏgamāḍāḍare
guttabum̐guṁḍalo kŏṁḍalo kusamulo
hatti yerbaḍam̐ga nanare mīru

(||||)
tāmĕradūṁḍlo tadiyagu tīgĕlo
bhāmasedu lerbarasare yibuḍu
domaḍisiṁhamo tŏḍam̐ginabayalo
āmāḍāḍare aṁdulo nŏgaḍi

(||||)
nīlabumaṇulo niṁḍina meghamo
bālagiduru mŏgabalugunam̐ jĕppare
yīlīla śhrī veṁkaḍeśhvarum̐gūḍĕnu
melimi mĕṟum̐go mĕlum̐to yanare