అల్లాడఁ బడి వున్నదా ఆఁడుఁదనము
(॥పల్లవి॥)
అల్లాడఁ బడి వున్నదా ఆఁడుఁదనము
పల్లదాన బదికితే పచ్చిగాదా తనువు
(॥॥)
వొగ్గిన వలపులెంత వొడిఁగట్టుకొనినాను
యెగ్గు సిగ్గు లేకుండుతే నేఁటి వనిత
నిగ్గుల రమణుఁడెంత నేరవుగా మన్నించినా
వెగ్గళించి మాటాడిన విరుగదా మనసు
(॥॥)
నెచ్చిలికి వయసెంత నిలువున వడిసినా-
నిచ్చకము లేకుండితే నేఁటివేడుక
మచ్చిక నాతఁడెంత మంతనాన నవ్వినాను
రచ్చల నాడుకొంటే రవ్వగావా రతులు
(॥॥)
ఘనముగ నెంత సింగారించుకుండినాను
యెనయక వుండితేను యేటి నేరుపు
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసి నిన్నిటె నేఁడు
పెనగించుకొంటేను పెరుగదా చలము
(||pallavi||)
allāḍam̐ baḍi vunnadā ām̐ḍum̐danamu
palladāna badigide pachchigādā tanuvu
(||||)
vŏggina valabulĕṁta vŏḍim̐gaṭṭugŏninānu
yĕggu siggu leguṁḍude nem̐ṭi vanida
niggula ramaṇum̐ḍĕṁta neravugā manniṁchinā
vĕggaḽiṁchi māḍāḍina virugadā manasu
(||||)
nĕchchiligi vayasĕṁta niluvuna vaḍisinā-
nichchagamu leguṁḍide nem̐ṭiveḍuga
machchiga nādam̐ḍĕṁta maṁtanāna navvinānu
rachchala nāḍugŏṁṭe ravvagāvā radulu
(||||)
ghanamuga nĕṁta siṁgāriṁchuguṁḍinānu
yĕnayaga vuṁḍidenu yeḍi nerubu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasi ninniḍĕ nem̐ḍu
pĕnagiṁchugŏṁṭenu pĕrugadā salamu