Aliveninim bemdlaadavayaa

అలివేణినిఁ బెండ్లాడవయా
Language

(॥పల్లవి॥)
అలివేణినిఁ బెండ్లాడవయా
చెలుల విన్నపము చేకొనవయ్యా

(॥॥)
సొలపులఁ దొలితొలి చూచినచూపులు
కొలఁదిమీర నుంకువలాయ
చెలఁగి చేతులను సేసినన్నులు
తలఁపఁగ నలుగడఁ దలఁబాలయ

(॥॥)
ననుపున సెలవుల నవ్విననవ్వులు
గొనకొనఁగఁ బాలకూళ్ళాయ
అనువుగఁ ప్రియమున నాడినమాటలు
మనసిజతంత్రపుమంత్రములాయ

(॥॥)
వేడుకకాఁగిటివినయపు సేఁతలు
కూడినకూటపుగురులాయ
యీడనె శ్రీ వేంకటేశ యేలితివి
తోడలమేల్మంగ దోమట్లాయ

(||pallavi||)
aliveṇinim̐ bĕṁḍlāḍavayā
sĕlula vinnabamu segŏnavayyā

(||||)
sŏlabulam̐ dŏlidŏli sūsinasūbulu
kŏlam̐dimīra nuṁkuvalāya
sĕlam̐gi sedulanu sesinannulu
talam̐pam̐ga nalugaḍam̐ dalam̐bālaya

(||||)
nanubuna sĕlavula navvinanavvulu
gŏnagŏnam̐gam̐ bālagūḽḽāya
anuvugam̐ priyamuna nāḍinamāḍalu
manasijadaṁtrabumaṁtramulāya

(||||)
veḍugagām̐giḍivinayabu sem̐talu
kūḍinagūḍabugurulāya
yīḍanĕ śhrī veṁkaḍeśha yelidivi
toḍalamelmaṁga domaṭlāya