అలిగివుండిన నన్ను ఆయములంటీఁ దాను
(॥పల్లవి॥)
అలిగివుండిన నన్ను ఆయములంటీఁ దాను
నెలకొన్న కూటమికి నేనూఁ గావలెనా
(॥అలి॥)
చుట్టరికములు సేయ సుదతు లెందరు లేరు
ఇట్టె పాదాలు విసుక నెందరు లేరు
వట్టనడుమ నవ్వులు నవ్వఁగ నెందరు లేరు
నెట్టుకొన వేఁడుకొనీ నేనూఁ గావలెనా
(॥అలి॥)
అంచెల సేవలు సేయ నప్పటి నెందరు లేరు
యెంచఁగ బంతికూటికి నెందరు లేరు
మించి విడేలందుకొను మెలుఁత లెందరు లేరు
నించి చెక్కులు నొక్కీని నేనూఁ గావలెనా
(॥అలి॥)
వలచి దినదినము వరుస కెందరు లేరు
యెలమిఁ దన్నుఁ బొగడ నెందు లేరు
అలరి శ్రీవేంకటేశుఁడంతలోనె నన్నుఁ గూడె
నెలకొని బుజ్జగించె నేనూఁ గావలెనా
(||pallavi||)
aligivuṁḍina nannu āyamulaṁṭīm̐ dānu
nĕlagŏnna kūḍamigi nenūm̐ gāvalĕnā
(||ali||)
suṭṭarigamulu seya sudadu lĕṁdaru leru
iṭṭĕ pādālu visuga nĕṁdaru leru
vaṭṭanaḍuma navvulu navvam̐ga nĕṁdaru leru
nĕṭṭugŏna vem̐ḍugŏnī nenūm̐ gāvalĕnā
(||ali||)
aṁchĕla sevalu seya nappaḍi nĕṁdaru leru
yĕṁcham̐ga baṁtigūḍigi nĕṁdaru leru
miṁchi viḍelaṁdugŏnu mĕlum̐ta lĕṁdaru leru
niṁchi sĕkkulu nŏkkīni nenūm̐ gāvalĕnā
(||ali||)
valasi dinadinamu varusa kĕṁdaru leru
yĕlamim̐ dannum̐ bŏgaḍa nĕṁdu leru
alari śhrīveṁkaḍeśhum̐ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
nĕlagŏni bujjagiṁchĕ nenūm̐ gāvalĕnā