Aligina yalugellaa naraseda nunna dide

అలిగిన యలుకెల్లా నరచేత నున్న దిదె
Language

(॥పల్లవి॥)
అలిగిన యలుకెల్లా నరచేత నున్న దిదె
తలపోసి చూచుకొంటే తనకేమి బాఁతే

(॥॥)
కుప్పవడ్డయలకలు కుమ్మరింపుఁ జెమటలు
చిప్పిలు మోవితేనెలు సేనాసేన
రెప్పలతుద కెంపు రేసువడ్డచల్లజంపు
దప్పిదేరీ నీవియెల్లా తనకేమి బాఁతే

(॥॥)
మాసినట్టి పై చెఱఁగు మంతనములో కరఁగు
పోసపు బాస పోఁకకుఁ బుట్టెడేసి
వేసర నీకుంటెనులు వేవేలు వెంటెనలు
తాన వేసి చూచితే తనకేమి బాఁతే

(॥॥)
కాఁగిటకలయికలు కందున అలయికలు
చేఁగలవాని చెట్టునఁ జేటఁడేసి
ఆఁగి కూడెను శ్రీ వేంకటాదిపుఁడు నను నిట్టె
దాఁగరానిసరసాలు తనకేమి బాఁతే

(||pallavi||)
aligina yalugĕllā naraseda nunna didĕ
talabosi sūsugŏṁṭe tanagemi bām̐te

(||||)
kuppavaḍḍayalagalu kummariṁpum̐ jĕmaḍalu
sippilu movidenĕlu senāsena
rĕppaladuda kĕṁpu resuvaḍḍasallajaṁpu
dappiderī nīviyĕllā tanagemi bām̐te

(||||)
māsinaṭṭi pai sĕṟam̐gu maṁtanamulo karam̐gu
posabu bāsa pom̐kagum̐ buṭṭĕḍesi
vesara nīguṁṭĕnulu vevelu vĕṁṭĕnalu
tāna vesi sūside tanagemi bām̐te

(||||)
kām̐giḍagalayigalu kaṁduna alayigalu
sem̐galavāni sĕṭṭunam̐ jeḍam̐ḍesi
ām̐gi kūḍĕnu śhrī veṁkaḍādibum̐ḍu nanu niṭṭĕ
dām̐garānisarasālu tanagemi bām̐te