Aligidinaa needo nalasi ne numti nimte

అలిగితినా నీతో నలసి నే నుంటి నింతే
Language

(॥పల్లవి॥)
అలిగితినా నీతో నలసి నే నుంటి నింతే
యెలమి నీవు రాఁగా నే నెదురురాకుందునా

(॥అతి॥)
నీమోము చూచి చూచి నివ్వెరగందితి నింతే
యేమాటకైనా నుత్తర మియ్యకుందునా
కామించి నీమేను సోఁకి కళవట్టి వుంటిఁగాక
నామతి నీచేఁతలకు నగకుందునా

(॥అలి॥)
చేతికి వీడె మియ్యఁగాఁ జెమరించి వుంటిఁగాక
ఘాతలఁ గాఁగిలించక కడనుందునా
బూతుల నన్నుఁ దిట్టఁగఁ బులకించి వుంటి నింతే
కాతరాన మోవి ఇచ్చి కాఁక సేయకుందునా

(॥అలి॥)
సరుగ నీవు గూడఁగ సమ్మతించి వుంటి నింతే
గరిమఁ జిత్తమురా మొక్కకవుందునా
ఇరవైనశ్రీవేంకటేశ నీరతుల నేను
మరిగి మెచ్చితిఁగాక మరి జోలి సేతునా

(||pallavi||)
aligidinā nīdo nalasi ne nuṁṭi niṁte
yĕlami nīvu rām̐gā ne nĕdururāguṁdunā

(||adi||)
nīmomu sūsi sūsi nivvĕragaṁdidi niṁte
yemāḍagainā nuttara miyyaguṁdunā
kāmiṁchi nīmenu som̐ki kaḽavaṭṭi vuṁṭim̐gāga
nāmadi nīsem̐talagu nagaguṁdunā

(||ali||)
sedigi vīḍĕ miyyam̐gām̐ jĕmariṁchi vuṁṭim̐gāga
ghādalam̐ gām̐giliṁchaga kaḍanuṁdunā
būdula nannum̐ diṭṭam̐gam̐ bulagiṁchi vuṁṭi niṁte
kādarāna movi ichchi kām̐ka seyaguṁdunā

(||ali||)
saruga nīvu gūḍam̐ga sammadiṁchi vuṁṭi niṁte
garimam̐ jittamurā mŏkkagavuṁdunā
iravainaśhrīveṁkaḍeśha nīradula nenu
marigi mĕchchidim̐gāga mari joli sedunā