Aligidi namtaa nela atte nannu vemdugoni

అలిగితి నంటా నేల అట్టే నన్ను వేఁడుకొని
Language

(॥పల్లవి॥)
అలిగితి నంటా నేల అట్టే నన్ను వేఁడుకొని
తలఁచే నా తలఁపులు తా నెఱుఁగఁడా

(॥॥)
సతి వద్ద నుండఁగాను చాయ సేసుకొంటీఁ గాక
రతికిఁదాఁ బిలువఁగ రాకుండుదునా
కతలు చెప్పుకోఁగాను కడ నిలుచుండీఁగాక
తతి నూడిగాలకు దగ్గరక వుందునా

(॥॥)
తెరవేసుకుండఁగా సందేహమున నుంటీఁగాక
అరసి తా వీడె మీఁ గా నంద కుందునా
విరుల వేట్లాడఁగా వింతలు చూచితిఁగాక
గరిమఁదా వలె నంటే కౌఁగిలించకుందునా

(॥॥)
వేడుక కాఁడై వుండఁగా వేళ దెలిసితి గాక
కూడి పాదా లొత్తుమంటేఁ గొంకివుందునా
యీడనే శ్రీ వేంకటేశుఁడింతలోఁ దా నన్నునేలే
వాడిక దా నడపితే వడి మెచ్చకుందునా

(||pallavi||)
aligidi naṁṭā nela aṭṭe nannu vem̐ḍugŏni
talam̐se nā talam̐pulu tā nĕṟum̐gam̐ḍā

(||||)
sadi vadda nuṁḍam̐gānu sāya sesugŏṁṭīm̐ gāga
radigim̐dām̐ biluvam̐ga rāguṁḍudunā
kadalu sĕppugom̐gānu kaḍa nilusuṁḍīm̐gāga
tadi nūḍigālagu daggaraga vuṁdunā

(||||)
tĕravesuguṁḍam̐gā saṁdehamuna nuṁṭīm̐gāga
arasi tā vīḍĕ mīm̐ gā naṁda kuṁdunā
virula veṭlāḍam̐gā viṁtalu sūsidim̐gāga
garimam̐dā valĕ naṁṭe kaum̐giliṁchaguṁdunā

(||||)
veḍuga kām̐ḍai vuṁḍam̐gā veḽa dĕlisidi gāga
kūḍi pādā lŏttumaṁṭem̐ gŏṁkivuṁdunā
yīḍane śhrī veṁkaḍeśhum̐ḍiṁtalom̐ dā nannunele
vāḍiga dā naḍabide vaḍi mĕchchaguṁdunā