Alayimchagure nannu namdanunna selulaala

అలయించకురే నన్ను నండనున్న చెలులాల
Language

(॥పల్లవి॥)
అలయించకురే నన్ను నండనున్న చెలులాల
చెలువుఁ డీడకుఁ దా విచ్చేసు దాఁకాను

(॥అల॥)
మనసెక్కడనో వుంది మాటలఁ బెట్టకురే
ఘనుఁడు నారమణునిఁ గన్న దాఁకాను
తను వెక్కడనో వుంది దగ్గరి పిసుకకురే
గొనకొని యాతఁడు నేఁగడుదాఁకాను

(॥అల॥)
నగ వెక్కడనో వుంది నను వేగిరించకురే
మొగి నాతని నాచెయి మోచుదాఁకాను
పగ టెక్కడనో వుంది బలిమి సేయకురే
జిగి నాతఁడు నా చేతఁ జిక్కుదాఁకాను

(॥అల॥)
పాయ మెక్కడవో వుంది భ్రమలఁ బెట్టుకురే
యీయడ నాతఁడు మంచ మెక్కుదాఁకాను
పాయక శ్రీవేంకటాద్రిపతి నన్ను నిటు గూడె
మోయనాడకురే వీని మొక్కించుదాఁకాను

(||pallavi||)
alayiṁchagure nannu naṁḍanunna sĕlulāla
sĕluvum̐ ḍīḍagum̐ dā vichchesu dām̐kānu

(||ala||)
manasĕkkaḍano vuṁdi māḍalam̐ bĕṭṭagure
ghanum̐ḍu nāramaṇunim̐ ganna dām̐kānu
tanu vĕkkaḍano vuṁdi daggari pisugagure
gŏnagŏni yādam̐ḍu nem̐gaḍudām̐kānu

(||ala||)
naga vĕkkaḍano vuṁdi nanu vegiriṁchagure
mŏgi nādani nāsĕyi mosudām̐kānu
paga ṭĕkkaḍano vuṁdi balimi seyagure
jigi nādam̐ḍu nā sedam̐ jikkudām̐kānu

(||ala||)
pāya mĕkkaḍavo vuṁdi bhramalam̐ bĕṭṭugure
yīyaḍa nādam̐ḍu maṁcha mĕkkudām̐kānu
pāyaga śhrīveṁkaḍādribadi nannu niḍu gūḍĕ
moyanāḍagure vīni mŏkkiṁchudām̐kānu