Alasidini punyabaabamula aagalim badi nenu

అలసితిని పుణ్యపాపముల ఆకలిఁ బడి నేను
Language

(॥పల్లవి॥)
అలసితిని పుణ్యపాపముల ఆకలిఁ బడి నేను
గెలిచితిని నిన్నుఁ గొలిచి యింకఁ గీర్తింపుచు నిర్మలుఁడనైతిని

(॥అలసితి॥)
యింక నేను యీ పదునాలుగు లోకముల చొచ్చి యెన్నాళ్ళు దప్పించుకొనువాఁడ
యింక నేను నేఁ జేసిన దానంబులు చూపి యెందాఁకాఁ బెనఁగెడువాఁడ
యింక నేను నా పుత్రమిత్రుల నడుమ నెట్టు దాఁగఁ గలవాడ
యింక నేను యిల దివ్యతీర్థముల వెంటవెంట నెక్కడని పారేడఁ గలవాఁడ

(॥అలసితి॥)
యింక నేను నానాదేవతల మఱుఁగునను యేది గొలది దొబ్బఁ గలవాఁడ
యింక నేను బహు జంతురూపములు గైకొని యేపగిదిని బొంకఁగలవాఁడ
యింక నేను మంత్రములు జపంచి యేరీతి మాయల గెలిచేటివాఁడ
యింక నేను సంసారము చూపి యేమని నమ్మించఁ గలవాఁడ

(॥అలసితి॥)
యింక నేను నీ దాసుఁడనై ఇటువలె నుండఁ గలవాఁడ
యింక నేను నీవే గతి యని యిహముఁ బరముఁ జేకొనువాఁడ
యింక నేను అలమేలుమంగకు యీశ్వరుఁడవైన శ్రీవేంకటేశా
యింక నేను ఆచార్యుననుమతి హృదయములోపలఁ దలఁచువాఁడ

(||pallavi||)
alasidini puṇyabābamula āgalim̐ baḍi nenu
gĕlisidini ninnum̐ gŏlisi yiṁkam̐ gīrdiṁpusu nirmalum̐ḍanaidini

(||alasidi||)
yiṁka nenu yī padunālugu logamula sŏchchi yĕnnāḽḽu dappiṁchugŏnuvām̐ḍa
yiṁka nenu nem̐ jesina dānaṁbulu sūbi yĕṁdām̐kām̐ bĕnam̐gĕḍuvām̐ḍa
yiṁka nenu nā putramitrula naḍuma nĕṭṭu dām̐gam̐ galavāḍa
yiṁka nenu yila divyadīrdhamula vĕṁṭavĕṁṭa nĕkkaḍani pāreḍam̐ galavām̐ḍa

(||alasidi||)
yiṁka nenu nānādevadala maṟum̐gunanu yedi gŏladi dŏbbam̐ galavām̐ḍa
yiṁka nenu bahu jaṁturūbamulu gaigŏni yebagidini bŏṁkam̐galavām̐ḍa
yiṁka nenu maṁtramulu jabaṁchi yerīdi māyala gĕliseḍivām̐ḍa
yiṁka nenu saṁsāramu sūbi yemani nammiṁcham̐ galavām̐ḍa

(||alasidi||)
yiṁka nenu nī dāsum̐ḍanai iḍuvalĕ nuṁḍam̐ galavām̐ḍa
yiṁka nenu nīve gadi yani yihamum̐ baramum̐ jegŏnuvām̐ḍa
yiṁka nenu alamelumaṁgagu yīśhvarum̐ḍavaina śhrīveṁkaḍeśhā
yiṁka nenu āsāryunanumadi hṛdayamulobalam̐ dalam̐suvām̐ḍa