అలసితి మన్ని టాను ఆసలనే పొంది పొంది
(॥పల్లవి॥)
అలసితి మన్ని టాను ఆసలనే పొంది పొంది
నెలకొని యింతటా మన్నించవయ్య మమ్మును
(॥ఆలసి॥)
సారె సారె మాటాడించి చౌక సేసేవు వలపు
ఆరీతి నవ్వుచు మరి అలయించేవు
పేరఁబెట్టి గుట్టుసేసి బేరమాడేవు వలపు
నేరుపరివౌదువు మన్నించవయ్య మమ్మును
(॥ఆలసి॥)
సరసములాడించి చెప్పఁజేసేవు వలపు
వొరసి వొరసి కాఁక లొడిఁ బెట్టేవు
తొరలఁగ నవ్వించి దొడ్డిఁ బెట్టేవు వలపు
నెరపితివి మేలు మన్నించవయ్య మమ్మును
(॥ఆలసి॥)
గక్కనఁ గాఁగిట నించి కళరేఁచేవు వలపు
చెక్కిట రేకలు దీసి సిగ్గు వెంచేవు
యెక్కువ శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టె
నిక్కమాయ నీబాస మన్నించవయ్యా మమ్మును
(||pallavi||)
alasidi manni ṭānu āsalane pŏṁdi pŏṁdi
nĕlagŏni yiṁtaḍā manniṁchavayya mammunu
(||ālasi||)
sārĕ sārĕ māḍāḍiṁchi sauga sesevu valabu
ārīdi navvusu mari alayiṁchevu
peram̐bĕṭṭi guṭṭusesi beramāḍevu valabu
nerubarivauduvu manniṁchavayya mammunu
(||ālasi||)
sarasamulāḍiṁchi sĕppam̐jesevu valabu
vŏrasi vŏrasi kām̐ka lŏḍim̐ bĕṭṭevu
tŏralam̐ga navviṁchi dŏḍḍim̐ bĕṭṭevu valabu
nĕrabidivi melu manniṁchavayya mammunu
(||ālasi||)
gakkanam̐ gām̐giḍa niṁchi kaḽarem̐sevu valabu
sĕkkiḍa regalu dīsi siggu vĕṁchevu
yĕkkuva śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭĕ
nikkamāya nībāsa manniṁchavayyā mammunu