Alasevu solasevu appude neevu

అలసేవు సొలసేవు అప్పుడే నీవు
Language

(॥పల్లవి॥)
అలసేవు సొలసేవు అప్పుడే నీవు
వలపు రేఁచుట గాక వట్టిసట లేఁటికే

(॥॥)
సరసమాడేవిభుఁడు చన్ను లెంతపిసికినా
కరఁగి కూడుటగాక కసరనేలే
గొరబుగాఁ గూడేవాఁడు గోర నెంత వూఁదినాను
దొరసి మెచ్చుట గాక దూరనేఁటికే

(॥॥)
మగఁడైనవాఁడు రతి మచ్చరము చూపితేను
నగుట గాక మాఁటలవెగటులేలే
తగుల మోహించువాఁడు తమకించి పొదిగితే
సొగిసి లోనౌటగాక బిగియనేలే

(॥॥)
సందడిఁ బెండ్లాడేవాఁడు సారెఁ బువ్వులవేసితే
విందులఁజొక్కుటగాక విసువులేలే
యిందరిలో శ్రీ వేంకటేశుఁడిట్టె నిన్ను నేలె
సందుకొనవలెఁగాక చలపట్టనేలే

(||pallavi||)
alasevu sŏlasevu appuḍe nīvu
valabu rem̐suḍa gāga vaṭṭisaḍa lem̐ṭige

(||||)
sarasamāḍevibhum̐ḍu sannu lĕṁtabisiginā
karam̐gi kūḍuḍagāga kasaranele
gŏrabugām̐ gūḍevām̐ḍu gora nĕṁta vūm̐dinānu
dŏrasi mĕchchuḍa gāga dūranem̐ṭige

(||||)
magam̐ḍainavām̐ḍu radi machcharamu sūbidenu
naguḍa gāga mām̐ṭalavĕgaḍulele
tagula mohiṁchuvām̐ḍu tamagiṁchi pŏdigide
sŏgisi lonauḍagāga bigiyanele

(||||)
saṁdaḍim̐ bĕṁḍlāḍevām̐ḍu sārĕm̐ buvvulaveside
viṁdulam̐jŏkkuḍagāga visuvulele
yiṁdarilo śhrī veṁkaḍeśhum̐ḍiṭṭĕ ninnu nelĕ
saṁdugŏnavalĕm̐gāga salabaṭṭanele