Alani viṟina jaana ladiva lellaa

అలని విూఱిన జాణ లతివ లెల్లా
Language

(॥పల్లవి॥)
అలని విూఱిన జాణ లతివ లెల్లా
మెలఁత భావము లివి మెచ్చవలెఁ గాక

(॥అలవి॥)
యెదుటఁ గన్నులు సేసె నింతే కాక చూపులలో
కదలు గడించెనా కమలజుఁడు
పొదిగి యాతని నేమి పొగడే రందరూఁ గూడి
సుదతినేరుపులకే చొక్కవలెఁ గాకా

(॥అలవి॥)
నివ్వటిల్లు మెఱుఁగల నెమ్మోము సేసేఁ గాక
నవ్వులు గడించెనా నలినజుఁడు
యివ్వల నిదేమి చూచే రిది యంతటాఁ గలదే
జవ్వనివిలాసము లెంచఁగవలెఁ గాకా

(॥అలవి॥)
రంగగుఁ జక్కఁదనము రాసి సేసేఁ గాక యీకె
సింగారము నించెనా చేరి యజుఁడు
ముంగిట శ్రీవేంకటేశు మోహించఁ జేసినట్టి
అంగన నింకా గొనియాడవలెఁ గాకా

(||pallavi||)
alani viూṟina jāṇa ladiva lĕllā
mĕlam̐ta bhāvamu livi mĕchchavalĕm̐ gāga

(||alavi||)
yĕduḍam̐ gannulu sesĕ niṁte kāga sūbulalo
kadalu gaḍiṁchĕnā kamalajum̐ḍu
pŏdigi yādani nemi pŏgaḍe raṁdarūm̐ gūḍi
sudadinerubulage sŏkkavalĕm̐ gāgā

(||alavi||)
nivvaḍillu mĕṟum̐gala nĕmmomu sesem̐ gāga
navvulu gaḍiṁchĕnā nalinajum̐ḍu
yivvala nidemi sūse ridi yaṁtaḍām̐ galade
javvanivilāsamu lĕṁcham̐gavalĕm̐ gāgā

(||alavi||)
raṁgagum̐ jakkam̐danamu rāsi sesem̐ gāga yīgĕ
siṁgāramu niṁchĕnā seri yajum̐ḍu
muṁgiḍa śhrīveṁkaḍeśhu mohiṁcham̐ jesinaṭṭi
aṁgana niṁkā gŏniyāḍavalĕm̐ gāgā