Alamelumamgavu nee vannidaa nerubarivi

అలమేలుమంగవు నీ వన్నిటా నేరుపరివి
Language

(॥పల్లవి॥)
అలమేలుమంగవు నీ వన్నిటా నేరుపరివి
చలములేఁటికి నిఁక సమ్మతించవే

(॥॥)
విడియము చేతికిచ్చి విభుఁడు వేడుకపడి
వొడివట్టి పెనఁగగా నొద్దనకువే
వుడివోని వేడుకతో నుంగరము చేతికిచ్చి
యెడయక వేఁడుకొనఁగా నియ్యకొనవే

(॥॥)
చిప్పిలువలపుతోడ చెక్కులు నొక్కుచు మోవిఁ-
గప్పుర మందియ్యఁగాను కాదనకువే
కొప్పు దువ్వి బుజ్జగించి కొసరి మాటలాడి
అప్పసము నవ్వఁగాను అట్టె కానిమ్మనవే

(॥॥)
యిచ్చగించి శ్రీ వేంకటేశ్వరుఁడు నిన్నుఁ గూడి
మచ్చికఁ గాఁగిలించఁగాను మారాడకువే
పచ్చడము మీఁదఁ గప్పి పట్టపుదేవులఁ జేసి
నిచ్చలాన నేలుకొనె నీవూఁ గైకొనవే

(||pallavi||)
alamelumaṁgavu nī vanniḍā nerubarivi
salamulem̐ṭigi nim̐ka sammadiṁchave

(||||)
viḍiyamu sedigichchi vibhum̐ḍu veḍugabaḍi
vŏḍivaṭṭi pĕnam̐gagā nŏddanaguve
vuḍivoni veḍugado nuṁgaramu sedigichchi
yĕḍayaga vem̐ḍugŏnam̐gā niyyagŏnave

(||||)
sippiluvalabudoḍa sĕkkulu nŏkkusu movim̐-
gappura maṁdiyyam̐gānu kādanaguve
kŏppu duvvi bujjagiṁchi kŏsari māḍalāḍi
appasamu navvam̐gānu aṭṭĕ kānimmanave

(||||)
yichchagiṁchi śhrī veṁkaḍeśhvarum̐ḍu ninnum̐ gūḍi
machchigam̐ gām̐giliṁcham̐gānu mārāḍaguve
pachchaḍamu mīm̐dam̐ gappi paṭṭabudevulam̐ jesi
nichchalāna nelugŏnĕ nīvūm̐ gaigŏnave