Alamelumamgavu nee vaadanigi devulavu

అలమేలుమంగవు నీ వాతనికి దేవులవు
Language

(॥పల్లవి॥)
అలమేలుమంగవు నీ వాతనికి దేవులవు
వెలసి కూడితి విఁక వెరగందేవేమే

(॥అల॥)
ననిచిన కాంతులకు నవ్వులు వేగమే వచ్చు
మనసులెనసినట్టి మగనితోను
చెనకితేఁ జాలును సిగ్గులు చాలా నిండు
వనితరో నీవేల వంచేవే శిరసు

(॥అల॥)
తగులుగలవారికి తనువెల్లాఁ జెమరించు
జిగిమించ రమణుని చెంత నుండితే
మొగమెత్తి చూచితేను ముంచు మదనకళలు
వెగటుగాఁ దెర యేల వేసుకొనేవే

(॥అల॥)
వావిగల సతులకు వలపులు గడు రేఁగు
శ్రీవేంకటేశుఁడైన చెలువునొద్ద
చేవదేరఁ బెనఁగితే చిన్నలెల్లాఁ గానవచ్చు
కావరానఁ బయ్యదేల కప్పుకోనేలే

(||pallavi||)
alamelumaṁgavu nī vādanigi devulavu
vĕlasi kūḍidi vim̐ka vĕragaṁdeveme

(||ala||)
nanisina kāṁtulagu navvulu vegame vachchu
manasulĕnasinaṭṭi maganidonu
sĕnagidem̐ jālunu siggulu sālā niṁḍu
vanidaro nīvela vaṁcheve śhirasu

(||ala||)
tagulugalavārigi tanuvĕllām̐ jĕmariṁchu
jigimiṁcha ramaṇuni sĕṁta nuṁḍide
mŏgamĕtti sūsidenu muṁchu madanagaḽalu
vĕgaḍugām̐ dĕra yela vesugŏneve

(||ala||)
vāvigala sadulagu valabulu gaḍu rem̐gu
śhrīveṁkaḍeśhum̐ḍaina sĕluvunŏdda
sevaderam̐ bĕnam̐gide sinnalĕllām̐ gānavachchu
kāvarānam̐ bayyadela kappugonele