అలమేలుమంగపతివని నిన్నెఱఁగదేమో
(॥పల్లవి॥)
అలమేలుమంగపతివని నిన్నెఱఁగదేమో
కలికి చేఁతలు నీకు గంపల నమ్మీని
(॥అల॥)
నెరవాది తనమెంతో నీవెదుట నుండఁగా
తరుణి సిగ్గులనే దడి గట్టీని
గరిమలఁ దా నెన్ని కతలఁ గరచెనో
పెరరేఁచి వినయాలు పేరఁ బెట్టీని
(॥అల॥)
కచ్చుక యెన్నాళ్లనుండి కాచుకుండెనో నీతో
తచ్చన మాఁటలనే దండగట్టీని
బచ్చెన వేసాలు నెంత పరగినదో కాని
పచ్చి నవ్వులనే తలఁబాలు వోసీని
(॥అల॥)
తారుకొణగా నిన్నెంత దక్కఁగినుకొన్నదో
సారె సారె వలపుల జాజరాడీని
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కూరిమిఁ దానూఁ గొంత కొసరి లాచీని
(||pallavi||)
alamelumaṁgabadivani ninnĕṟam̐gademo
kaligi sem̐talu nīgu gaṁpala nammīni
(||ala||)
nĕravādi tanamĕṁto nīvĕduḍa nuṁḍam̐gā
taruṇi siggulane daḍi gaṭṭīni
garimalam̐ dā nĕnni kadalam̐ garasĕno
pĕrarem̐si vinayālu peram̐ bĕṭṭīni
(||ala||)
kachchuga yĕnnāḽlanuṁḍi kāsuguṁḍĕno nīdo
tachchana mām̐ṭalane daṁḍagaṭṭīni
bachchĕna vesālu nĕṁta paraginado kāni
pachchi navvulane talam̐bālu vosīni
(||ala||)
tārugŏṇagā ninnĕṁta dakkam̐ginugŏnnado
sārĕ sārĕ valabula jājarāḍīni
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
kūrimim̐ dānūm̐ gŏṁta kŏsari lāsīni