Alamelumamgabadi yannidaa jaanam didamdu

అలమేలుమంగపతి యన్నిటా జాణఁ డితఁడు
Language

(॥పల్లవి॥)
అలమేలుమంగపతి యన్నిటా జాణఁ డితఁడు
ఇల మీ చుట్టరిక మిరవాయ సుండీ

(॥అల॥)
వుంకించి కృష్ణుడు వుట్టు గొట్టీ
వేంకటాద్రిపురవీథులను
మంకుగొల్లెతలు మరి మీరు పెనఁగితే
నుంకించి మానాలు సొఁకీనసుండీ

(॥అల॥)
పాలు వెరుగు వారబట్టి గోవిందుఁడు
సోలిఁ గొనేటియీచుట్టులను
అలించి గొల్లెత లటు మీరు సొలసితే
చెలకొంగు లంటినే సిగ్గుయ్యీసుండీ

(॥అల॥)
చేకొని వెన్నలు జుఱ్ఱీ శ్రీవేంకటేశుఁడు
వాకైననిది మీఁదివాడలను
కాకరిగొల్లెతలు కాంగిలించి పట్టేరు
యేకమైతిరి మీగుట్టు లెరింగీసుండి

(||pallavi||)
alamelumaṁgabadi yanniḍā jāṇam̐ ḍidam̐ḍu
ila mī suṭṭariga miravāya suṁḍī

(||ala||)
vuṁkiṁchi kṛṣhṇuḍu vuṭṭu gŏṭṭī
veṁkaḍādriburavīthulanu
maṁkugŏllĕdalu mari mīru pĕnam̐gide
nuṁkiṁchi mānālu sŏm̐kīnasuṁḍī

(||ala||)
pālu vĕrugu vārabaṭṭi goviṁdum̐ḍu
solim̐ gŏneḍiyīsuṭṭulanu
aliṁchi gŏllĕda laḍu mīru sŏlaside
sĕlagŏṁgu laṁṭine sigguyyīsuṁḍī

(||ala||)
segŏni vĕnnalu juṭrī śhrīveṁkaḍeśhum̐ḍu
vāgainanidi mīm̐divāḍalanu
kāgarigŏllĕdalu kāṁgiliṁchi paṭṭeru
yegamaidiri mīguṭṭu lĕriṁgīsuṁḍi