Alamelumamgabadi yaadamdauda ya(ye?)ṟamgavaa

అలమేలుమంగపతి యాతఁడౌత య(యె?)ఱఁగవా
Language

(॥పల్లవి॥)
అలమేలుమంగపతి యాతఁడౌత య(యె?)ఱఁగవా
బలిమి చేఁతల నెంత పచ్చిదేరేవే

(॥అల॥)
తళుకునఁ జూచేవు తత్తరాన లాచేవు
పలుకులఁ గొసరేవు పతిని నీవు
సెలవుల నవ్వేవు చేతఁ బాపట దువ్వేవు
కలికితనాల నెంత కతకారివే

(॥అల॥)
హత్తి సేవల సేసేవు అట్టె పువ్వుల వేసేవు
గుత్తపు గుబ్బలఁ బతి గుచ్చి యెత్తేవు
బత్తి చూపి సొలసేవు పలుమారు మలసేవు
చిత్తణి గుణాల నెంత చిమ్మిరేఁగేవే

(॥అల॥)
వావు లెల్లాఁజెప్పేవు వలపుల గుప్పేవు
శ్రీవేంకటేశుఁ గడుఁ జెక్కు నొక్కేవు
భావించి కేల మొక్కేవు పాదమునుఁ దొక్కేవు
కావిరి రతుల నెంత కాఁగిటఁ గూడేవే

(||pallavi||)
alamelumaṁgabadi yādam̐ḍauda ya(yĕ?)ṟam̐gavā
balimi sem̐tala nĕṁta pachchidereve

(||ala||)
taḽugunam̐ jūsevu tattarāna lāsevu
palugulam̐ gŏsarevu padini nīvu
sĕlavula navvevu sedam̐ bābaḍa duvvevu
kaligidanāla nĕṁta kadagārive

(||ala||)
hatti sevala sesevu aṭṭĕ puvvula vesevu
guttabu gubbalam̐ badi guchchi yĕttevu
batti sūbi sŏlasevu palumāru malasevu
sittaṇi guṇāla nĕṁta simmirem̐geve

(||ala||)
vāvu lĕllām̐jĕppevu valabula guppevu
śhrīveṁkaḍeśhum̐ gaḍum̐ jĕkku nŏkkevu
bhāviṁchi kela mŏkkevu pādamunum̐ dŏkkevu
kāviri radula nĕṁta kām̐giḍam̐ gūḍeve