అలమేలుమంగపతి వన్నిటా నెరజాణవు
(॥పల్లవి॥)
అలమేలుమంగపతి వన్నిటా నెరజాణవు
చెలరేఁగి చూడవయ్య చేతులెత్తి మొక్కేను
(॥అల॥)
వాడలోన నిన్నుఁ బాసి వలపు నిలుపరాక
ఆడరానిమాట లెల్లా నాడితి నిన్ను
పాడిపంతాలు నెరపఁబనిలేదు ఇంత నువు
యీడుజోడై యేలవయ్యా ఇంతి నింతే నేను
(॥అల॥)
పాయము దానఁగనక పక్కనుండి వేడుకకు
సేయరాని చేఁతలెల్లాఁ జేసితి నేను
నాయము లెంచఁగఁబోతే నగుఁబాట్లిందరిలో
యీయెడ మన్నించవయ్యా ఇంతి నింతే నేను
(॥అల॥)
నివ్వటిల్లు నాసతోడ నీమీఁది బత్తిఁజేసి
నవ్వఁగలరీతినెల్లా నవ్వతి నేను
రవ్వగా శ్రీవేంకటేశ రతి నన్నుఁ గూడితివి
యివ్వలఁ బాయకువయ్యా యింతి నింతే నేను
(||pallavi||)
alamelumaṁgabadi vanniḍā nĕrajāṇavu
sĕlarem̐gi sūḍavayya sedulĕtti mŏkkenu
(||ala||)
vāḍalona ninnum̐ bāsi valabu nilubarāga
āḍarānimāḍa lĕllā nāḍidi ninnu
pāḍibaṁtālu nĕrabam̐baniledu iṁta nuvu
yīḍujoḍai yelavayyā iṁti niṁte nenu
(||ala||)
pāyamu dānam̐ganaga pakkanuṁḍi veḍugagu
seyarāni sem̐talĕllām̐ jesidi nenu
nāyamu lĕṁcham̐gam̐bode nagum̐bāṭliṁdarilo
yīyĕḍa manniṁchavayyā iṁti niṁte nenu
(||ala||)
nivvaḍillu nāsadoḍa nīmīm̐di battim̐jesi
navvam̐galarīdinĕllā navvadi nenu
ravvagā śhrīveṁkaḍeśha radi nannum̐ gūḍidivi
yivvalam̐ bāyaguvayyā yiṁti niṁte nenu