(॥పల్లవి॥)
అళగరి చక్కనళగరి వో యళగరి
తలఁచుకోర నా మాట తారుకాణ సుమ్మీ
(॥॥)
అలిగితేఁ బోనీదు ఆకెకు లోనైనమీఁద
వలపు రేఁపుచు నిన్ను వంచుఁగాని
పలుకక పోనీదు పక్కున నవ్వినమీఁద
సళువుఁజూపులు నీపైఁ జాఁచుఁగాని
(॥॥)
చవులు చూపుకపోదు సరసమాడినమీఁద
చివురుఁగెమ్మోవి గంటిచేసుఁగాని
అవల మాటాడనీదు అతివఁ జేకొన్నమీఁద
తివిరి నీవెంటవెంటఁ దిరుగాడుఁగాని
(॥॥)
నిన్ను మెచ్చించకపోదు నలఁతఁ గూడినమీఁద
కన్నులు దేలగిలంగఁ గరఁచుఁగాని
అన్నిటా శ్రీవేంకటాద్రి నళగుఁదిరుమలను
వన్నె నీవురువుమీఁదఁ గాఁపురమౌఁగాని
(||pallavi||)
aḽagari sakkanaḽagari vo yaḽagari
talam̐sugora nā māḍa tārugāṇa summī
(||||)
aligidem̐ bonīdu āgĕgu lonainamīm̐da
valabu rem̐pusu ninnu vaṁchum̐gāni
palugaga ponīdu pakkuna navvinamīm̐da
saḽuvum̐jūbulu nībaim̐ jām̐sum̐gāni
(||||)
savulu sūbugabodu sarasamāḍinamīm̐da
sivurum̐gĕmmovi gaṁṭisesum̐gāni
avala māḍāḍanīdu adivam̐ jegŏnnamīm̐da
tiviri nīvĕṁṭavĕṁṭam̐ dirugāḍum̐gāni
(||||)
ninnu mĕchchiṁchagabodu nalam̐tam̐ gūḍinamīm̐da
kannulu delagilaṁgam̐ garam̐sum̐gāni
anniḍā śhrīveṁkaḍādri naḽagum̐dirumalanu
vannĕ nīvuruvumīm̐dam̐ gām̐puramaum̐gāni