అలపు దీర్చుకోరాదా అన్నీ నయ్యీఁ గాని
(॥పల్లవి॥)
అలపు దీర్చుకోరాదా అన్నీ నయ్యీఁ గాని
నిలువెల్లాఁ జెమరించి నీళ్లుగారీని
(॥అల॥)
వీడె మందుకొనరాదా వెనక విచ్చేతుగాని
బీడై నీకెమ్మోవి పిప్పిగట్టెను
చూడరాదా మమ్ముఁగొంత చొక్కి కన్నుమూతుగాని
అడా నీడా నుమ్మఁదాకి యలపుదేరీని
(॥అల॥)
పాద మొత్తించుకోరాదా పక్కన నవ్వుదుగాని
వీదులెల్లాఁ దిరుగాడి విసిగినది
జూదమైనా నాడరాదా సొంట్లు సోదింతుగాని
అదిగొని కోరికలు అంకెకుఁ దీసీని
(॥అల॥)
పవళించి వుండరాదా పానుపుపై నిఁకనైనా
జవళిఁ బులుకలు మై జడిసీని
యివల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
సవతులఁ దేకుమీ చలమెక్కీని
(||pallavi||)
alabu dīrsugorādā annī nayyīm̐ gāni
niluvĕllām̐ jĕmariṁchi nīḽlugārīni
(||ala||)
vīḍĕ maṁdugŏnarādā vĕnaga vichchedugāni
bīḍai nīgĕmmovi pippigaṭṭĕnu
sūḍarādā mammum̐gŏṁta sŏkki kannumūdugāni
aḍā nīḍā nummam̐dāgi yalabuderīni
(||ala||)
pāda mŏttiṁchugorādā pakkana navvudugāni
vīdulĕllām̐ dirugāḍi visiginadi
jūdamainā nāḍarādā sŏṁṭlu sodiṁtugāni
adigŏni korigalu aṁkĕgum̐ dīsīni
(||ala||)
pavaḽiṁchi vuṁḍarādā pānububai nim̐kanainā
javaḽim̐ bulugalu mai jaḍisīni
yivala śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
savadulam̐ degumī salamĕkkīni