Ala vadabatrashaayivaina rooba mittidani

అల వటపత్రశాయివైన రూప మిట్టిదని
Language

(॥పల్లవి॥)
అల వటపత్రశాయివైన రూప మిట్టిదని
కొలువై పొడచూపేవా గోవిందరాజా

(॥అల॥)
పడఁతులిద్దరిమీద బాదములు చాఁచుకొని
వొడికపు రాజసాన నొత్తగిలి
కడలేని జనాభికమలమున బ్రహ్మను
కొడుకుఁగా గంటి విదె గోవిందరాజా

(॥అల॥)
సిరులసొమ్ములతోడ శేషునిపైఁ బవళించి
సొరిది దాసులఁ గృపఁ జూచుకొంటాను
పరగుదైత్యులమీఁద పామువిషములే నీవు
కురియించితివిగా గోవిందరాజా

(॥అల॥)
శంకుఁజక్రములతోడఁ జాఁచినకరముతోడ
అంకెల శిరసు కింది హస్తముతోడ
తెంకిన శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో
కొంకక వరములిచ్చే గోవిందరాజా

(||pallavi||)
ala vaḍabatraśhāyivaina rūba miṭṭidani
kŏluvai pŏḍasūbevā goviṁdarājā

(||ala||)
paḍam̐tuliddarimīda bādamulu sām̐sugŏni
vŏḍigabu rājasāna nŏttagili
kaḍaleni janābhigamalamuna brahmanu
kŏḍugum̐gā gaṁṭi vidĕ goviṁdarājā

(||ala||)
sirulasŏmmuladoḍa śheṣhunibaim̐ bavaḽiṁchi
sŏridi dāsulam̐ gṛpam̐ jūsugŏṁṭānu
paragudaityulamīm̐da pāmuviṣhamule nīvu
kuriyiṁchidivigā goviṁdarājā

(||ala||)
śhaṁkum̐jakramuladoḍam̐ jām̐sinagaramudoḍa
aṁkĕla śhirasu kiṁdi hastamudoḍa
tĕṁkina śhrīveṁkaḍādri diguvadirubadilo
kŏṁkaga varamulichche goviṁdarājā