Ala brahmaadula kanamga didi

అల బ్రహ్మాదుల కణఁగ దిది
Language

(॥పల్లవి॥)
అల బ్రహ్మాదుల కణఁగ దిది
గెలువఁగ వశమా కేశవ మాకు

(॥అల॥)
పాపము మనసునఁ బారకమానదు
కోపము మానఁగఁగూడదు
యేపున దేహం బెన్నాళ్లు మోఁచెను
తీపుల యిది యా దేహపుగుణము

(॥అల॥)
ఆఁకలిదీరదు యటు నానాఁటికి
కాఁకలు మానవు కాంత లేక
మాఁకువంటి జన్మము గలకాలము
చీఁకటి దేహపు చిత్తపుగుణము

(॥అల॥)
నీవు వొసఁగినదె నిర్మలదేహము
నీవె నా నేర్పునేరములు
శ్రీవేంకటేశుఁడ జిగి నీ శరణని
దీవెనఁ బొందితి దేహపుగుణము

(||pallavi||)
ala brahmādula kaṇam̐ga didi
gĕluvam̐ga vaśhamā keśhava māgu

(||ala||)
pābamu manasunam̐ bāragamānadu
kobamu mānam̐gam̐gūḍadu
yebuna dehaṁ bĕnnāḽlu mom̐sĕnu
tībula yidi yā dehabuguṇamu

(||ala||)
ām̐kalidīradu yaḍu nānām̐ṭigi
kām̐kalu mānavu kāṁta lega
mām̐kuvaṁṭi janmamu galagālamu
sīm̐kaḍi dehabu sittabuguṇamu

(||ala||)
nīvu vŏsam̐ginadĕ nirmaladehamu
nīvĕ nā nerbuneramulu
śhrīveṁkaḍeśhum̐ḍa jigi nī śharaṇani
dīvĕnam̐ bŏṁdidi dehabuguṇamu