అక్కవు నీవు నాకు నైనానైతివి గాని
(॥పల్లవి॥)
అక్కవు నీవు నాకు నైనానైతివి గాని
వొక్కింతవడికైనా నోపుదువటె
(॥అక్క॥)
చెలరేఁగి చెలరేఁగి చేతులు చాఁచేవు నీవు
వలెనటే నీతో నీకు వరవాతాను
బలుములు చూపి పెక్కుపంతములాడుకొనేవు
నిలిచేవా నాముందర నేరుపులను
(॥అక్క॥)
నారువోసి నారువోసి నవ్వులు నవ్వేవు నీవు
వోరిచేవటే నాతో వొడ్డారాలకు
పేరువాడి పేరువాడి బిరుదులు మెరసేవు
చేరఁగలవా నాచేవల్లకు
(॥అక్క॥)
పెచ్చురేఁగి పెచ్చురేఁగి పెనఁగేవు నాతోను
వచ్చేవటే నాతోడి వరుసలకు
యిచ్చగించి శ్రీవేంకటేశుఁ డిద్దరిఁ గూడె
మెచ్చేవటే నిన్నుమించినయందుకును
(||pallavi||)
akkavu nīvu nāgu nainānaidivi gāni
vŏkkiṁtavaḍigainā nobuduvaḍĕ
(||akka||)
sĕlarem̐gi sĕlarem̐gi sedulu sām̐sevu nīvu
valĕnaḍe nīdo nīgu varavādānu
balumulu sūbi pĕkkubaṁtamulāḍugŏnevu
nilisevā nāmuṁdara nerubulanu
(||akka||)
nāruvosi nāruvosi navvulu navvevu nīvu
vorisevaḍe nādo vŏḍḍārālagu
peruvāḍi peruvāḍi birudulu mĕrasevu
seram̐galavā nāsevallagu
(||akka||)
pĕchchurem̐gi pĕchchurem̐gi pĕnam̐gevu nādonu
vachchevaḍe nādoḍi varusalagu
yichchagiṁchi śhrīveṁkaḍeśhum̐ ḍiddarim̐ gūḍĕ
mĕchchevaḍe ninnumiṁchinayaṁdugunu