Akkasellemdla middaramaide naidimigaaga

అక్కచెల్లెండ్ల మిద్దరమైతే నైతిమిగాక
Language

(॥పల్లవి॥)
అక్కచెల్లెండ్ల మిద్దరమైతే నైతిమిగాక
చక్కఁగా జాణతనాలు సరిదూఁచవచ్చునా

(॥అక్క॥)
యెంతయినా సవతుల యీడుకు రావచ్చుఁగాక
వంతు లడుగవచ్చునావలపు నేఁడు
సంతోసానఁ బతిమోవి చవిగొనవచ్చుఁగాక
జంతిఁ బెట్టుకోవచ్చునా పాయ మెవ్వరికిని

(॥అక్క॥)
రాను లొకచోటఁ గాఁపురము సేయవచ్చుఁగాక
వామి వేయవచ్చేనా వాసులు నేఁడు
నాముకొన నాతనితో నవ్వునవ్వవచ్చుఁగాక
దోమటిగాసిగ్గులెల్లదొడ్డిఁబెట్టవచ్చునా

(॥అక్క॥)
వొద్దిక చుట్టాలు పొందు లొనగూడవచ్చుఁగాక
వద్దనఁగవచ్చునా వాపులునేఁడు
అద్దుక శ్రీవేంకటేశు డలమె నిన్నును నన్ను
గద్దించి నేరుపులెల్లా గాదెఁ బోయవచ్చునా

(||pallavi||)
akkasĕllĕṁḍla middaramaide naidimigāga
sakkam̐gā jāṇadanālu saridūm̐savachchunā

(||akka||)
yĕṁtayinā savadula yīḍugu rāvachchum̐gāga
vaṁtu laḍugavachchunāvalabu nem̐ḍu
saṁtosānam̐ badimovi savigŏnavachchum̐gāga
jaṁtim̐ bĕṭṭugovachchunā pāya mĕvvarigini

(||akka||)
rānu lŏgasoḍam̐ gām̐puramu seyavachchum̐gāga
vāmi veyavachchenā vāsulu nem̐ḍu
nāmugŏna nādanido navvunavvavachchum̐gāga
domaḍigāsiggulĕlladŏḍḍim̐bĕṭṭavachchunā

(||akka||)
vŏddiga suṭṭālu pŏṁdu lŏnagūḍavachchum̐gāga
vaddanam̐gavachchunā vābulunem̐ḍu
adduga śhrīveṁkaḍeśhu ḍalamĕ ninnunu nannu
gaddiṁchi nerubulĕllā gādĕm̐ boyavachchunā