(॥పల్లవి॥)
అక్కలాల చూడరే వీ నటమటాలు
యెక్కడోవారి చేఁతలే యితవాయనా
(॥అక్క॥)
చిన్నఁబోయి వుండఁగాను చెక్కు నొక్కి వేఁడుకొంటే
నన్నుఁ దిట్టీ కొనగోరు నాఁటెనంటాను
కన్నవారెల్లా వీఁపు గాఁడిపారఁ దమ తమ
చన్నులనొత్తేయప్పుడు సాదించలేఁడాయనా
(॥అక్క॥)
పవ్వళించి వుండఁగాను పాదములు గుద్దితేను
నొవ్వులఁ బొరలీ మేను నొచ్చెనంటాను
మవ్వపుఁ గాంతలు కాలి మర్దనలు సేయఁగాను
నెవ్వగనట్టే మూలుగ నేరఁడాయనా
(॥అక్క॥)
కడుబడలుండఁగాను కాఁగిటనే నించితేను
తడఁబడీ రతికళ దాఁకెనంటాను
అడరి శ్రీవేంకటేశుఁ డందరికాఁగిళ్లలోన
వడఁబడేయప్పుడేమి వాసి నేరఁడాయనా
(||pallavi||)
akkalāla sūḍare vī naḍamaḍālu
yĕkkaḍovāri sem̐tale yidavāyanā
(||akka||)
sinnam̐boyi vuṁḍam̐gānu sĕkku nŏkki vem̐ḍugŏṁṭe
nannum̐ diṭṭī kŏnagoru nām̐ṭĕnaṁṭānu
kannavārĕllā vīm̐pu gām̐ḍibāram̐ dama tama
sannulanŏtteyappuḍu sādiṁchalem̐ḍāyanā
(||akka||)
pavvaḽiṁchi vuṁḍam̐gānu pādamulu guddidenu
nŏvvulam̐ bŏralī menu nŏchchĕnaṁṭānu
mavvabum̐ gāṁtalu kāli mardanalu seyam̐gānu
nĕvvaganaṭṭe mūluga neram̐ḍāyanā
(||akka||)
kaḍubaḍaluṁḍam̐gānu kām̐giḍane niṁchidenu
taḍam̐baḍī radigaḽa dām̐kĕnaṁṭānu
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍaṁdarigām̐giḽlalona
vaḍam̐baḍeyappuḍemi vāsi neram̐ḍāyanā