Akkalaala ammalaala aayambo pani

అక్కలాల అమ్మలాల ఆయఁబో పని
Language

(॥పల్లవి॥)
అక్కలాల అమ్మలాల ఆయఁబో పని
వెక్కసాన నేడనైనా వింటిరా యీ తగవు

(॥అక్క॥)
చెక్కు నొక్కి మెచ్చఁబోతే చేతి గోరు దాఓకె ననీ
మక్కళించి తన్నొరయ మాసటీఁడనా
మక్కు వ పురుషుఁడట మానిని నేఁ దనకట
ఇక్కడ మాతల వేగె నిటువంటి పనులు

(॥అక్క॥)
ఇల్లిదె ఆకు యాకుమడిచీ యీఁగా నోరు వొక్కెననీ
చెల్లఁబో యెగసక్కెము సేసే దాననా
బల్లిదానఁ బాపమంటాఁ బాలువోయఁ బోతేను
వొల్ల నోకిలించె నన్న వూహ నిజమాయఁగా

(॥అక్క॥)
కదిసి కాలుదొక్కి గళదాఁకె నిదెయనీ
పదపద యంత నేరుపరినా నేను
యెదుట శ్రీవేంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూడె
యిది వో అన్నియుఁ జెల్లే నిఁకనేలే మాటలు

(||pallavi||)
akkalāla ammalāla āyam̐bo pani
vĕkkasāna neḍanainā viṁṭirā yī tagavu

(||akka||)
sĕkku nŏkki mĕchcham̐bode sedi goru dāogĕ nanī
makkaḽiṁchi tannŏraya māsaḍīm̐ḍanā
makku va puruṣhum̐ḍaḍa mānini nem̐ danagaḍa
ikkaḍa mādala vegĕ niḍuvaṁṭi panulu

(||akka||)
illidĕ āgu yāgumaḍisī yīm̐gā noru vŏkkĕnanī
sĕllam̐bo yĕgasakkĕmu sese dānanā
ballidānam̐ bābamaṁṭām̐ bāluvoyam̐ bodenu
vŏlla nogiliṁchĕ nanna vūha nijamāyam̐gā

(||akka||)
kadisi kāludŏkki gaḽadām̐kĕ nidĕyanī
padabada yaṁta nerubarinā nenu
yĕduḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi nannum̐ gūḍĕ
yidi vo anniyum̐ jĕlle nim̐kanele māḍalu