Akkadam jeli yalabu yikkada nee gelubu

అక్కడఁ జెలి యలపు యిక్కడ నీ గెలుపు
Language

(॥పల్లవి॥)
అక్కడఁ జెలి యలపు యిక్కడ నీ గెలుపు
యిక్కడ నక్కడఁ గంటి మిఁక నీచిత్తము

(॥అక్క॥)
వ్రాసేటి నేలలవ్రాఁత వాఁకలచెమటయీఁత
గాసిలు నూర్పులమోఁత కాంతపాలాయ
బేసబెల్లిలేనగవు పిలువఁగానే బిగువు
వేసాలయీతగవు విభుఁడ నీపాలు

(॥అక్క॥)
చెలిమూపుపై నొరగు చిత్తములో నివ్వెరగు
చలిజింతలపొరుగు సతిపాలాయ
వెలినుండేనిక్కచూపు వెడబొంకు రేపుమాపు
నిలువులతరితీపు నీపాలాయ

(॥అక్క॥)
కాఁగిటిలో తమకము కదిసినగమకము
దాగి యిట్టెసముకము తరుణిపాలు
వేగి శ్రీవేంకటపతివేడుకైనసమరతి
యీగతి మెచ్చినమతి యిది నీసాలాయ

(||pallavi||)
akkaḍam̐ jĕli yalabu yikkaḍa nī gĕlubu
yikkaḍa nakkaḍam̐ gaṁṭi mim̐ka nīsittamu

(||akka||)
vrāseḍi nelalavrām̐ta vām̐kalasĕmaḍayīm̐ta
gāsilu nūrbulamom̐ta kāṁtabālāya
besabĕllilenagavu piluvam̐gāne biguvu
vesālayīdagavu vibhum̐ḍa nībālu

(||akka||)
sĕlimūbubai nŏragu sittamulo nivvĕragu
salijiṁtalabŏrugu sadibālāya
vĕlinuṁḍenikkasūbu vĕḍabŏṁku rebumābu
niluvuladaridību nībālāya

(||akka||)
kām̐giḍilo tamagamu kadisinagamagamu
dāgi yiṭṭĕsamugamu taruṇibālu
vegi śhrīveṁkaḍabadiveḍugainasamaradi
yīgadi mĕchchinamadi yidi nīsālāya