Akkadaa praanigini ahambrahmatvame kaani

అక్కటా ప్రాణికిని అహంబ్రహ్మత్వమే కాని
Language

(॥పల్లవి॥)
అక్కటా ప్రాణికిని అహంబ్రహ్మత్వమే కాని
దిక్కుదెస యైనవానిఁ దెలుసుకో నోపఁడు

(॥అక్కటా॥)
కలలోన సృజియించుఁ గర్తయై యంతర్యామి
లలిఁబ్రపంచ మింద్రజాలములవలె
తలపోయు జీవుఁడు తనకృత్యములు గావు
వెలి నెందుఁ బుట్టె నని విచారించుకోఁడు

(॥అక్కటా॥)
యెదుటనే పొడమించు యీరూపు లాత్మేశుఁడు
కదిసి పురాణముల కతలవలె
వదలక జీవుఁ డెవ్వరిని నేమించలేఁడు
పదరక మూలముట్టు భావించుకోఁడు

(॥అక్కటా॥)
కనిపించు మోక్ష మిక్కడ శ్రీవేంకటేశుఁడు
పనివడి తన తపఃఫలమువలె
ఘనతఁ బొందుజీవుఁడే కర్మమువాఁడుగాఁడు
గొనకొన్న మహిమల గుఱు తెంచుకొనఁడు

(||pallavi||)
akkaḍā prāṇigini ahaṁbrahmatvame kāni
dikkudĕsa yainavānim̐ dĕlusugo nobam̐ḍu

(||akkaḍā||)
kalalona sṛjiyiṁchum̐ gardayai yaṁtaryāmi
lalim̐brabaṁcha miṁdrajālamulavalĕ
talaboyu jīvum̐ḍu tanakṛtyamulu gāvu
vĕli nĕṁdum̐ buṭṭĕ nani visāriṁchugom̐ḍu

(||akkaḍā||)
yĕduḍane pŏḍamiṁchu yīrūbu lātmeśhum̐ḍu
kadisi purāṇamula kadalavalĕ
vadalaga jīvum̐ ḍĕvvarini nemiṁchalem̐ḍu
padaraga mūlamuṭṭu bhāviṁchugom̐ḍu

(||akkaḍā||)
kanibiṁchu mokṣha mikkaḍa śhrīveṁkaḍeśhum̐ḍu
panivaḍi tana tabaḥphalamuvalĕ
ghanadam̐ bŏṁdujīvum̐ḍe karmamuvām̐ḍugām̐ḍu
gŏnagŏnna mahimala guṟu tĕṁchugŏnam̐ḍu