Akkadaa ne nirmalumdanayye dimka nennamdo

అక్కటా నే నిర్మలుఁడనయ్యే దిఁక నెన్నఁడో
Language

(॥పల్లవి॥)
అక్కటా నే నిర్మలుఁడనయ్యే దిఁక నెన్నఁడో
చక్క నన్ను దిద్దుకోనే సర్వేశ్వరా

(॥అక్క॥)
నేనే మంచివాఁడనై తే నిండుకోదా జ్ఞానము
కానీలే యింకా నేమేమి గడమో కాక
ఆనుక సుకృతినైతే నలవడదా విర క్తి
కానరాని తప్పు లెన్నిగలవో కాక

(॥అక్క॥)
నామనసే చక్కనైతే నాకుఁ బ్రత్యక్షము గావా
చేముంచి నేరమేమి సేసితినో కాక
ఆముక మోక్షాధికారినైతే నెదురుగా రాదా
కామితార్థాలు భోగించఁ గలుగఁబోలుఁ గాక

(॥అక్క॥)
ఔలే నామేను పవిత్రమైతే సేవ గొనవా
యేలాగున్నదో నీచిత్త మెఱఁగఁ గాక
యీలీల శ్రీవేంకటేశ యెదుటనే వున్నాఁడవు
యేలుకొని చేపట్టి యీడేర్చవు గాక

(||pallavi||)
akkaḍā ne nirmalum̐ḍanayye dim̐ka nĕnnam̐ḍo
sakka nannu diddugone sarveśhvarā

(||akka||)
nene maṁchivām̐ḍanai te niṁḍugodā jñānamu
kānīle yiṁkā nememi gaḍamo kāga
ānuga sukṛtinaide nalavaḍadā vira kti
kānarāni tappu lĕnnigalavo kāga

(||akka||)
nāmanase sakkanaide nāgum̐ bratyakṣhamu gāvā
semuṁchi neramemi sesidino kāga
āmuga mokṣhādhigārinaide nĕdurugā rādā
kāmidārdhālu bhogiṁcham̐ galugam̐bolum̐ gāga

(||akka||)
aule nāmenu pavitramaide seva gŏnavā
yelāgunnado nīsitta mĕṟam̐gam̐ gāga
yīlīla śhrīveṁkaḍeśha yĕduḍane vunnām̐ḍavu
yelugŏni sebaṭṭi yīḍersavu gāga