Akkadaa logonnadumdu harim jeri yitlayidi

అక్కటా లోకోన్నతుఁడు హరిఁ జేరి యిట్లయితి
Language

(॥పల్లవి॥)
అక్కటా లోకోన్నతుఁడు హరిఁ జేరి యిట్లయితి
యెక్కువ స్వర్గాని కెక్కి యేకులు వడుకుటా

(॥అక్కటా॥)
హరికి మొక్కిన మొక్కు లల్పసుఖమునకు
వెరవెఱుఁగక తావెచ్చ పెట్టుటా
గరిమఁ గొండంతపైఁడి కలగూరకు మూఢ
నరుఁడు విలువ యిచ్చి, సరిఁగొనుకొనుటా

(॥అక్కటా॥)
తలఁచే హరిమంత్రము తనభోగములకై
నెలవు సేసికొని తాఁ జెనటి యవుట
పలి బందివేఁట వోయి పూరేడుఁ బట్టి తెచ్చి
ములుచ మానవుఁడు ముదమందుటా

(॥అక్కటా॥)
శ్రీ వేంకటేశ్వరుని సేవించి యితరులచే
భావించి యిప్పించుమని పనిగొనుటా
కావించి కల్పవృక్షము గాడిగుంజగాఁ బాఁతి
ఆవల దుర్మదదేహి అజ్ఞాని యవుటా

(||pallavi||)
akkaḍā logonnadum̐ḍu harim̐ jeri yiṭlayidi
yĕkkuva svargāni kĕkki yegulu vaḍuguḍā

(||akkaḍā||)
harigi mŏkkina mŏkku lalbasukhamunagu
vĕravĕṟum̐gaga tāvĕchcha pĕṭṭuḍā
garimam̐ gŏṁḍaṁtabaim̐ḍi kalagūragu mūḍha
narum̐ḍu viluva yichchi, sarim̐gŏnugŏnuḍā

(||akkaḍā||)
talam̐se harimaṁtramu tanabhogamulagai
nĕlavu sesigŏni tām̐ jĕnaḍi yavuḍa
pali baṁdivem̐ṭa voyi pūreḍum̐ baṭṭi tĕchchi
mulusa mānavum̐ḍu mudamaṁduḍā

(||akkaḍā||)
śhrī veṁkaḍeśhvaruni seviṁchi yidarulase
bhāviṁchi yippiṁchumani panigŏnuḍā
kāviṁchi kalbavṛkṣhamu gāḍiguṁjagām̐ bām̐ti
āvala durmadadehi ajñāni yavuḍā