అక్కడ నెక్కడి నరకము ఆ మాటే కల్లా
(॥పల్లవి॥)
అక్కడ నెక్కడి నరకము ఆ మాటే కల్లా
దిక్కుల ని(నిం?)దె ఇన్నియుఁ దీరుచుకొంటిమయ్యా
(॥అక్క॥)
తనువిది మలమూత్రంబుల(లు?) దాకొనియుండిన పట్ణము
దినదినమును వుచ్చిష్టపుదిడ్లఁ దూరెదము
జననము నెత్తురు నెమ్ములు సారెకు నూరెడిగుంతలు
మనిమని నరకము చొచ్చిన మనుజుల మిదె నేము
(॥అక్క॥)
మదనజలంబుల కాలువ మాపెద్దల పూర్వంబులు(?)
పొదలిన పుత్రుల యిసిళ్లపుట్టలు వెట్టెదము
యెదుటనె సంసారంబులు యెడయని కారాగృహములు
మదిమది నరకము చవిగొను మనుజుల మిదె నేము
(॥అక్క॥)
వుట్టినదే నగ్నత్వము బూతో బండో యెరఁగము
చిట్టంట్లవాచవులగు జీవుల మ్రింగెదము
నెట్టన శ్రీవేంకటేశ్వర నీతోఁ గూడఁగ జగములు
మట్టినచోటే మట్టే మనుజుల మిదె నేము
(||pallavi||)
akkaḍa nĕkkaḍi naragamu ā māḍe kallā
dikkula ni(niṁ?)dĕ inniyum̐ dīrusugŏṁṭimayyā
(||akka||)
tanuvidi malamūtraṁbula(lu?) dāgŏniyuṁḍina paṭṇamu
dinadinamunu vuchchiṣhṭabudiḍlam̐ dūrĕdamu
jananamu nĕtturu nĕmmulu sārĕgu nūrĕḍiguṁtalu
manimani naragamu sŏchchina manujula midĕ nemu
(||akka||)
madanajalaṁbula kāluva mābĕddala pūrvaṁbulu(?)
pŏdalina putrula yisiḽlabuṭṭalu vĕṭṭĕdamu
yĕduḍanĕ saṁsāraṁbulu yĕḍayani kārāgṛhamulu
madimadi naragamu savigŏnu manujula midĕ nemu
(||akka||)
vuṭṭinade nagnatvamu būdo baṁḍo yĕram̐gamu
siṭṭaṁṭlavāsavulagu jīvula mriṁgĕdamu
nĕṭṭana śhrīveṁkaḍeśhvara nīdom̐ gūḍam̐ga jagamulu
maṭṭinasoḍe maṭṭe manujula midĕ nemu