(॥పల్లవి॥)
అజ్ఞానజంతువ నేనైతిఁ గాక
సుజ్ఞానమూర్తివి నీవు చూచుట తగవా
(॥అజ్ఞాన॥)
కోరితే రావలెఁ గాన కోరనివి రానేల
కోరితిమా దుఃఖములు గోవింద నిన్ను
ఆరయ పాపఫలము లవి యంటివా నీవు
యేరీతి నాత్మవు నీవు యిఁక దోషమున్నదా
(॥అజ్ఞాన॥)
అనాథనాథుఁడవు ఆతురబంధుఁడవు
సనాథుఁడను నేను సరి నుండఁగా
వినోద మిది నీకు విశ్వప్రపంచము
మనోధర్మముల నీ మాయ దాఁటఁగలనా
(॥అజ్ఞాన॥)
సరి గజదంతపరీక్షలు చూడ నెంతవాఁడ
ధర శ్రీ వేంకటేశుఁడ దాసుఁడ నీకు
గురువు నీ కొప్పగించె కోరి నీకు శరణంటి
నిరతిఁ జేకొంట గాక నేర్పు నేరాలున్నవా
(||pallavi||)
ajñānajaṁtuva nenaidim̐ gāga
sujñānamūrdivi nīvu sūsuḍa tagavā
(||ajñāna||)
koride rāvalĕm̐ gāna koranivi rānela
koridimā duḥkhamulu goviṁda ninnu
āraya pābaphalamu lavi yaṁṭivā nīvu
yerīdi nātmavu nīvu yim̐ka doṣhamunnadā
(||ajñāna||)
anāthanāthum̐ḍavu ādurabaṁdhum̐ḍavu
sanāthum̐ḍanu nenu sari nuṁḍam̐gā
vinoda midi nīgu viśhvaprabaṁchamu
manodharmamula nī māya dām̐ṭam̐galanā
(||ajñāna||)
sari gajadaṁtabarīkṣhalu sūḍa nĕṁtavām̐ḍa
dhara śhrī veṁkaḍeśhum̐ḍa dāsum̐ḍa nīgu
guruvu nī kŏppagiṁchĕ kori nīgu śharaṇaṁṭi
niradim̐ jegŏṁṭa gāga nerbu nerālunnavā